|
Context
Song Context:
వరమీయనా ఒడిచేర్చనా నీ మారం మానమ్మా… నా ఆరోప్రాణమా!
|
Song Lyrics
||ప|| |అతడు|
ప్రేమించవా ప్రియనేస్తమా నా హృదయం నీదమ్మా
|ఆమె|
వరమీయనా ఒడిచేర్చనా నీ మారం మానమ్మా
|అతడు|
జాలి వుంటే ఆలకించి ఆదరించమ్మా
|ఆమె|
ఓ పూలబాణమా
|అతడు|
నా ఆరోప్రాణమా
|ఖోరస్|
జతకలిసెనులె కధకదిలేనులే [[2]]
||ప్రేమించవా||
|ఖోరస్|
అందాల ఆ హరివిల్లు నీ వలపై విరిసింది
చందాల ఈ సిరిజల్లు నీ చెలిపై కురిసింది
.
||చ|| |అతడు|
నీ కనుపాపలలోన ఓ కలనైరాలేనా
|ఆమె|
నీ తలపులు క్షణమైన నను నిదరోనిస్తేనా
|అతడు|
ఒంటరి వేళలలోన నీ ఊహనుకాలేనా
|ఆమె|
తుంటరి తొందరలోన ఏమైన తోచేనా
|అతడు|
అన్నీ మరచి నిన్నే తలచి ఎమైపోతున్నా
|ఆమె|
ఏమో నీ యాతన
|అతడు|
నాకైనా తెలుసునా
|ఖోరస్|
మదికలవరమా మదనుడి మహిమ [[2]]
||ప్రేమించవా||
|ఖోరస్|
నీ ఒళ్ళో వాలిందయ్యూ నవ్వింక నవ్వింది
ఆటల్లో రెయిపగలు తేడాలే లేవంది
.
||చ|| |ఆమె|
గాలుల గుసగుసలోన నీ వూసులు వింటున్నా
|అతడు|
పువ్వుల మిసమిసలోన నీ నవ్వులు చూస్తున్నా
|ఆమె|
నిలబడనీయవే నన్ను ఒక్క నిమిషం పాటైనా
|అతడు|
కాలం కదలక నేను తెగ సతమతమౌతున్నా
|ఆమె|
చిలిపిగ అల్లిన ఇంతటి అల్లరి ఏంటిది ప్రేమెనా
|అతడు|
అవును ఎమో ప్రియతమా
|ఆమె|
నా ఆరోప్రాణమా
|ఖోరస్|
ఏం చిలిపితనం ఈ వలపుగుణం [[2]]
||ప్రేమించవా||
.
.
(Contributed by Phalgun) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)