|
Context
Song Context:
మెరుపేదొ తగిలింది తొలిసారిగా
పరిచయమవగానే ఆ మేనక! |
Song Lyrics
||ప||అతడు|
ప్రతిరాతిరి పదిదాటితే మరి నిలబడలేను
అలవాటుగ పిలవాలిగ నిదరన్నది నన్ను
సతమతమైనా ఇలా ఇంతగా
వెతుకుతు ఉన్నా మరేం తోచక
పదకొండె అవుతున్నా కునుకన్నది రాక
|| ప్రతిరాతిరి||
.
చరణం 1:
మెరుపేదొ తగిలింది తొలిసారిగా
పరిచయమవగానే ఆ మేనక
మరుపేదొ కలిగింది తియతీయగా
మతిచెడి నా మనసే చేజారగా
నువు చూడని స్వప్నాలేవో చూపిస్తా రమ్మంటూ
కునుకమ్మని పిలిచిందేమో తనతో చెలిమే చిలికే చిలకా…!
|| ప్రతిరాతిరి||
.
చరణం 2:
అనుకోని బరువేదొ పెరిగిందని
ఆమెకు తెలిసేనా ఏమైందని
అరుదైన వరమేదొ దొరికిందని
నా తలపే తనపై వాలిందని
తన ఊరూ పేరూ ఇంకా వివరంగా తేలందే
ఏమనుకుంటుందో ఏమో చెబితే అడిగే వరకూ తనుగా
|| ప్రతిరాతిరి||
.
.
(Contributed by Phanindra KSM) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
September 3rd, 2010 at 4:40 am
Small correction:
Producer is Ramoji Rao and Director is Srinivasa Rao.
Thanks
Harsha.
September 3rd, 2010 at 9:14 am
Thanks for close attention. Fixed it now.