|
Context
Song Context:
కదలని పాదమై నిలవని ప్రాణమై
నాకే నేను కొండంత బరువయ్యానని తెలుసునా నేస్తమా! |
Song Lyrics
||ప||అతడు|
చెరగనంది మదిలోని చెలిరూపం
కరగనంది దయలేని ఈ దూరం
నిలువెల్లా నను రగిలించే మంటల వెలుగైనా
నిను చేరే మార్గం చూపని నిశీధిలో ఉన్నా
కదలని పాదమై నిలవని ప్రాణమై
నాకే నేను కొండంత బరువయ్యానని తెలుసునా నేస్తమా
|| చెరగనంది ||
.
చరణం: అతడు:
ఎవరేమన్నా ఎదురేమున్నా తోడుగ ఉంటానని
చేయందించే చొరవేలేని నాతో రాలేనని
చెలిమే నను వెలివేసిందా, నీలో నను తరిమేసిందా
నను వేధిస్తున్న నీ జ్ఞాపకాలను ఎలా మరువనమ్మా
|| చెరగనంది ||
.
చరణం: అతడు:
నీకే నువ్వు సంకెలవైతే విడిపించేదెవరు
నిన్నే నువ్వు నమ్మకపోతే నిను నమ్మేదెవరు
అని నువ్వైనా నిలదీసావా నీ మౌనంతో బలిచేస్తావా
నువు నాకేం కాని ఈ జీవితాన్ని ఏం చేయనమ్మా
|| చెరగనంది ||
.
.
(Contributed by Phanindra KSM) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)