Movie Name
Bombayi Priyudu Singers S.P. Balu, Chitra Music Director
Keeravani Year Released 1996 Actors
J.D. Chakravarthy, Rambha Director K. Raghavendra Rao Producer K. KrishnaMohana Rao
Context
Song Context: ఓ యుగళ గీతం
Song Lyrics
||ప|| |ఆమె|
అహో ప్రియా…. అహో ప్రియా
|అతడు|
క్యా బాత్ బోలా చిడియా మెరా దిల్ ఫికర్ ఫికర్ హో గయా
|ఆమె|
అయ్యయ్యో మిమ్మల్ని కాదండి.. నేనోదో సరదాగా రాసుకున్న పాట
ప్రాక్టీస్ చేసుకుంటున్ననంతె… అంతే నండి…
|ఆమె|
అహో ప్రియా ఇంత కన్న తీయనైనా పిలుపు వేరే ఉందా
అహో అహో అహో ప్రియా అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
|అతడు|
కౌగిలించవా ప్రియా అనే జవాబు తానివ్వదా
|ఆమె| అహో అహో |అతడు| అహో ప్రియా
.
||చ|| |ఆమె|
రాగమంటు ఏమిటుంది అనురాగమను పాటకి
|అతడు|
తాళమంటు ఏమిటుంది పెనవేసుకొను ఆటకి
|ఆమె|
మూగ సైగ కన్న మంచి పలుకు ఏముంది
|అతడు|
ముద్దు కన్న పెద్దదైన కవిత ఏముంది
|ఆమె| జంట కోరే |అతడు| గుండెలన్నీ
|ఆమె| ఒక్కటై |అతడు| భాషలో
|ఆమె| దగ్గరవుతున్నవి
|అతడు|
కౌగిలించవా ప్రియా ప్రియా అనేటి భావం అదీ
|ఆమె| అహో |అతడు| అహో | ఇద్దరు | అహో ప్రియా
|ఆమె| ఇంత కన్న తీయనైనా పిలుపు వేరే ఉందా
|ఆమె| అహో |అతడు| అహో | ఇద్దరు | అహో ప్రియా
|అతడు| అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
.
||చ||
|ఆమె| తీయనైన స్నేహముంది |అతడు| విరిసేటి పూల తీగలో
|ఆమె| తీరిపోని దాహముంది |అతడు| తిరిగేటి తేనెటీగలో
|ఆమె| పూల బాల పరిమళాల కబురు పంపింది
|అతడు| తేనెటీగ చిలిపి పాట బదులు పలికింది
|ఆమె| ఎన్ని సార్లో విన్నదైనా
|అతడు| ఎందుకో ఎప్పుడూ కొత్తగా ఉంటది
|ఆమె| కౌగిలించవా ప్రియా ప్రియా అనేటి ఆ సంగతి
|ఆమె| అహో |అతడు| అహో | ఇద్దరు | అహో ప్రియా
|అతడు| ఇంత కన్న తీయనైనా పిలుపు వేరే ఉందా
|అతడు| అహో అహో అహో ప్రియా
| ఇద్దరు |
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
కౌగిలించవా ప్రియా అనే జవాబు తానివ్వదా
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world