Movie Name
Kala Singers S.P. Balu, Chitra Music Director
Dharma Teja Year Released 2004 Actors
Raja, Nayana Harshitha Director Chimmani Manohar Producer Ramachandra Reddy
Context
Song Context: A love song
Song Lyrics
||ప|| |అతడు|
ప్రియరాగాలనే పలికించావులే
నయగారాలనే ఒలికించావులే ||ప్రియ రాగాలనే||
మల్లెపూవల్లే విచ్చావులే
నువ్వు నాకెంతో నచ్చావులే ||ప్రియ రాగాలనే||
|ఆమె|
ప్రేమ తెరచాపలా నీవు నిలిచావులే
నీలి కనుపాపలో నన్ను నిలిపావులే ||ప్రేమ తెరచాపలా||
నిండు మనసంతా ఇచ్చావులే
అందుకే నిన్ను మెచ్చానులే
.
||చ|| |అతడు|
చినుకంత స్నేహం కోరిందని గగనాల మేఘం ఇల చేరదా
|ఆమె|
ఇన్నాళ్ళ దాహం తీరిందని చిగురాకు ప్రాణం పులకించదా
|అతడు|
కలల్లోని ఆ స్వర్గం ఇలా చేతికందింది
|ఆమె|
నిజంలోని ఆనందం మనస్సంత నిండింది
|అతడు|
నీకు తోడుండిపొమ్మన్నది
|ఆమె|
నన్ను నీ వెంట రమ్మన్నది ||ప్రియ రాగాలనే||
.
||చ|| |ఆమె|
బతుకంటే అర్థం చెబుతావని నడిపింది హృదయం నీ దారిని
|అతడు|
ఈ గాలి పయనం ఎన్నాళ్ళని, నీ ప్రేమబంధం నన్నాపనీ
|ఆమె|
ఋణం ఏదో మిగిలింది అదే నిన్ను కలిపింది
|అతడు|
మరీ ఆశ కలిగింది మరో జన్మ అడిగింది
|ఆమె|
నిన్ను ప్రేమించుకోమన్నది
|అతడు|
ప్రేమనే పంచుకోమన్నది ||ప్రియ రాగాలనే||
.
.
(Contributed by Prabha)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world