మన్మధుడు: నా మనసునే మీటకే నేస్తమా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Manmadhudu

Song Singers
   S.P. Balu, Chitra
Music Director
   Devisri Prasad
Year Released
   2002
Actors
   Nagarjuna, Sonali Bendre,
   Anshu
Director
   Vijaya Bhaskar
Producer
   Nagarjuna Akkineni

Context

Song Context:
             నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా

Song Lyrics

||ప|| |అతడు|
       నా మనసునే మీటకే నేస్తమా
       నా దారిలో చేరకే చైత్రమా
       సరదాల చిలిపితనమా
       చిరునవ్వులోని స్వరమా
       నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ
                            ||నా మనసునే||
.
||చ|| |అతడు|
       నాకెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి
|ఆమె|
       నీ వెంటపడే ఆశలకి చూపవా పూల దారి
|అతడు|
       చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగ
|ఆమె|
       తడి జాడ లేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగ
|అతడు|
       లేనిపోని సయ్యటతో వెంటాడకే ప్రేమ
|ఆమె|
       నీ కనులలో వెలగనీ ప్రియతమా
|అతడు|
       నీ పెదవికే తెలుపనీ మధురిమా
.
||చ|| |అతడు|
       నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను
|ఆమె|
       నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను
|అతడు|
       అలవాటు పడిన యద చీకటింట సరికొత్త వేకువై రావా
|ఆమె|
       కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా
|అతడు|
       నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమ
|ఆమె|
       నీ కనులలో వెలగనీ ప్రియతమా
       నీ పెదవికే తెలుపనీ మధురిమా
|అతడు|
       సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా
       నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా
.
.
            (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)