నీ స్నేహం: ఏమో అవునేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో

Posted by admin on 28th August 2009 in Love @ first sight

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nee Sneham

Song Singers
   Rajesh, Usha
Music Director
   R.P. Patnaik
Year Released
   2002
Actors
   Uday Kiran, Aarti Agarwal,
   Jatin
Director
   Paruchuri Murali
Producer
   M.S. Raju 

Context

Song Context:
       Love @ first sight!
       (ఏం చేసిందో ఆ చిన్నది, ప్రేమించేశానందీ మదీ!)

Song Lyrics

||ప|| |అతడు|
       ఏమో అవునేమో నిజమేమో
       నాలో మైమరపే ఋజువేమో
       ఏం చేసిందో ఆ చిన్నది 
       ప్రేమించేశానంది మదీ
       తన పేరైనా అడగాలన్నా ఎదరుండేనా
       చెప్పమ్మా వెన్నెలమ్మా…ఎవ్వరే ఆ జాబిలీ ||2||
                                            ||ఏమో||
.
||చ|| |అతడు|
       ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం
       మబ్బులో మెరుపులా తగలటం
       అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం
       నిద్రలో నడకలా సాగడం
       ఆ మెరుపు కంట పడకుంటే
       తన జంట కలిసి నడవందే
       ఈ మరపు వదలనంటుందే ఇంకెలా
       చెప్పమ్మా ఓ పావురమా…ఆమెతో ఈ సంగతి
                                            ||ఏమో||
.
||చ|| |అతడు|
       ఆమెనే వెతకడం..అందుకే బతకడం
       కొత్తగా ఉన్నదే అనుభవం
       ప్రేమనే పిలవడం…ప్రేమనే తెలపటం
       బొత్తిగా నేర్పదీ సతమతం
       తన కంటి చూపులో మౌనం చదివేదెలాగ నా హృదయం
       తన గుండె గూటిలో నే వాలేదెలా
       చెప్పమ్మా కలవరమా…ఆమెతో నీ అలజడి
                                           ||ఏమో||
.
.
                      (Contributed by Nagarjuna)

Highlights

ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం, మబ్బులో మెరుపులా తగలటం
అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం, నిద్రలో నడకలా సాగడం
ఆ మెరుపు కంట పడకుంటే, తన జంట కలిసి నడవందే
ఈ మరపు వదలనంటుందే ఇంకెలా, Nails the concept!
.
చరణం 2 illustrates the after effects :)
…………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)