మనసంతా నువ్వే: కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం

Posted by admin on 21st August 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
Movie Name
   Manasanta Nuvve

Song Singers
   Chitra
Music Director
   R.P. Patnaik
Year Released
   2001
Actors
   Uday Kiran, Reema Sen
Director
   V.N. Aditya
Producer
   M.S. Raju

Context

Song Context:
సూర్యోదయం + చంద్రోదయం రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా, ప్రేమా!

Song Lyrics

||ప|| |ఆమె|
       కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
       అటుఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం
       రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా
       ప్రేమా ప్రేమ…ప్రేమా ప్రేమ
                                            || కిటకిట ||
.
||చ|| |ఆమె|
       నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక
       కమ్మని కలలోనైనా నిను చూడలేదే
       నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంత
       రెప్పపాటైనా లేక చూడాలనుందే
       నా కోసమా అన్వేషణ…నీడల్లే వెంట ఉండగ
       కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా
       ప్రేమ ప్రేమ…ప్రేమా ప్రేమ
                                             || కిటకిట ||
.
||చ|| |ఆమె|
       కంట తడి నాడూ నేడూ చెంప తడిమిందే చూడు
       చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
       చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి
       అమృతం అయిపోలేదా ఆవేదనంతా
       ఇన్నాళ్లుగా నీ ఙాపకం నడిపింది నన్ను జంటగా
       ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా
       ప్రేమా ప్రేమ…ప్రేమా ప్రేమ
                                             || కిటకిట ||
.
.
                     (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)