Movie Name
Nee Sneham Song Singers Rajesh, R.P. Patnaik Music Director R.P. Patnaik Year Released 2002 Actors Uday Kiran, Aarti Agarwal,
Jatin Director Paruchuri Murali Producer M.S. Raju
Context
Song Context: స్నేహమంటే రూపు లేని ఊహ కాదని, నిన్ను నన్ను చూడగానే నమ్మితీరాలి!
Song Lyrics
||ప|| |అతడు|
కొంతకాలం కిందట బ్రహ్మదేవుడి ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపుకాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపు లేని ఊహ కాదని లొకమంతా
నిన్ను నన్ను చూడగానే నమ్మితీరాలి
||కొంత||
.
||చ|| |అతడు|
బొమ్మా బొరుసు లేని నాణానికి విలువుంటుందా
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కలతెరగని చిరునవ్వుగా
మా ఎద లయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం
||కొంత||
.
||చ|| |అతడు|
వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్థం
నువు నా లాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం
నువు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదురించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలి ఈ స్నేహం
||కొంత||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
నువు చూసే ప్రతి స్వప్నం, నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదురించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలి ఈ స్నేహం! ………………………………………………………………………………………..
3 Responses to “నీ స్నేహం: కొంతకాలం కిందట బ్రహ్మదేవుడి ముంగిట రెండు ఆత్మలు”
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world
October 27th, 2010 at 10:11 pm
స్నేహబంధం మాధుర్యాన్ని చిన్ని చిన్ని పదాలతో అల్లి
ఆత్మలు రెండు అయినా బంధం మాత్రం ఒకటే నని గుర్తుచేశారు….
November 2nd, 2010 at 5:12 am
స్నేహమంటే రూపు లేని ఊహ కాదని
నిన్ను నన్ను చూడగానే నమ్మితీరాలి
should be
స్నేహమంటే రూపు లేని ఊహ కాదని లొకమంతా
నిన్ను నన్ను చూడగానే నమ్మితీరాలి
November 3rd, 2010 at 5:59 am
Sri Harsha,
Thank you. fixed it.