Posted by admin on 28th August 2009 in
ప్రేమ
|
Song (1) Lyrics
Context: He is missing her!
(ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మ, అందాల ఆకాశమా!)
.
||ప|| |అతడు|
వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవ నేస్తమా
|| వేయి ||
.
||చ|| |అతడు|
నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంతచేరినా సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మ అందాల ఆకాశమా
|| వేయి||
.
.
(Contributed by Nagarjuna) |
Song (2) Lyrics
Context: She is in search of him while he continues to tease her!
(ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా,
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా!)
.
||ప|| |ఆమె|
వేయి కన్నులతో…తెరచాటు దాటి చేరదా నీ స్నేహం || వేయి ||
కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవ నేస్తమా
.
||చ|| |ఆమె|
ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా
రెప్పదాటి రాననే స్వప్నమేమి కాదనీ
ఒప్పుకుంటె నేరమా తప్పుకుంటే న్యాయమా
ఒక్కసారి…
|అతడు|
ఒక్కసారి అయినా చేయి అందించి ఈ దూరాన్ని కరిగించుమా
|| వేయి ||
.
||చ|| |అతడు|
ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతు లేనా
నీ హృదయం ఆ నిజమే నమ్ముతు ఉన్నా
వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ
చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా
ఎన్ని జన్మలైనా పోల్చుకోలేవు వెతికేది నీలోని నన్నేనని
|| వేయి ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights (1 & 2)
Yet another double header masterpiece - the పల్లవి exactly the same in both the contexts!
I changed the formatting of the page to accommodate both the versions in the same screen shot.
.
Two quite unique contexts:
The first one is - he is missing her and unable to tell who he is! &
the second one is - she is in search of him while he continues to tease her by hiding!
.
In the first one:
ఎంత చెంతచేరినా సొంతమవని బంధమా
ఎంత గాథ పెంచినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మ అందాల ఆకాశమా
.
In the second one:
ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా
రెప్పదాటి రాననే స్వప్నమేమి కాదనీ
ఒప్పుకుంటె నేరమా తప్పుకుంటే న్యాయమా ఒక్కసారి
…………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
September 12th, 2009 at 12:49 am
hey dude.. i guess yenthaga thapinchina is the write one in the second verse.. not yentha gaadha penchina
September 12th, 2009 at 9:45 am
Thank you Sir, for the correction. It is fixed.