Movie Name
Josh Song Singers Rahul Vaidya,
Ujjani Mukherjee Music Director Sandeep Chowta Year Released 2009 Actors Naga Chaitanya, Karthika Director Vasu Varma Producer Dil Raju
Context
Song Context: She just relaized, before him, that it is love, not friendship!
[కనకే అపురూపం కలిగే అనురాగం!]
Song Lyrics
||ప|| |అతడు|
ఎవ్వరికీ కనబడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం
|ఆమె|
కనకే అపురూపం కలిగే అనురాగం
ఎదలొనే కొలువున్నా ఎదురైనా పోల్చలేక
నిజమేలే అనుకున్నా రుజువేది తేల్చలేక… మరెలా…
||ఎవ్వరికీ|| |అతడు|
.
||చ|| |అతడు|
దారి అడగక పాదం నడుస్తున్నదా
వేళ తెలపక కాలం గడుస్తున్నదా
తడి వున్నదా ఎదలొ తడిమి చూసుకో
చెలిమిగ అడిగితే చెలి జంట చిలిపిగ పలకద వయసంత
జతపడు వలపుల గుడిగంట తలపుల తలుపులు తడుతుందా
|ఆమె|
చూస్తూనే పసికూన ఎదిగిందా ఇంతలోన
చెబితేనే ఇపుడైనా తెలిసిందా ఈ క్షణాన… అవునా….
||ఎవ్వరికీ|| |అతడు|
.
||చ|| |ఆమె|
కళ్ళు నువ్వొస్తుంటే మెరుస్తున్నవి
వెళ్ళి వస్తానంటే కురుస్తున్నవి
కొన్నాళ్ళుగా నాలో ఎన్ని వింతలు ఓహో
గలగల కబురులు చెబుతున్నా వదలదు గుబులొక గడియైన
మది అనవలసినదేదైనా పెదవుల వెనకన అణిగేనా
|అతడు|
హృదయంలో వింతభావం పదమేది లేని కావ్యం
ప్రణయంలో ప్రియ నాదం వింటూనే వుంది ప్రాణం… తెలుసా…
||ఎవ్వరికీ|| |ఆమె|
.
.
(Contributed by Vijaya Saradhi)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world