మహాత్మ: తల ఎత్తి జీవించు తమ్ముడా

Audio Song:
 
Movie Name
   Mahatma
Song Singers
   S.P. Balu
Music Director
   Vijay Anthony
Year Released
   2009
Actors
   Srikanth, Bhavana
Director
   Krishna Vamsi
Producer
   C.R. Manohar

Context

Song Context:
       తల ఎత్తి జీవించు తెలుగోడా!

Song Lyrics

||ఖోరస్||
       సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి
||ప|| |అతడు|
       తల ఎత్తి జీవించు తమ్ముడా
              తెలుగు నేలలో మొలకెత్తినానని
                     కనుక నిలువెత్తుగా ఎదిగినానని
       తల వంచి కైమోడ్చు తమ్ముడా
              తెలుగు తల్లి నను కని పెంచినాదని
                     కనుక తులలేని జన్మమ్ము నాదని
       త్రైలింగ ధామం త్రిలోకాభిరామం
       అనన్యం అగణ్యం ఎదో పూర్వపుణ్యం
       త్రిసంధ్యాభివంద్యం అహో జన్మ ధన్యం
                             ||తల ఎత్తి ||
.
||చ|| |అతడు|
       శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టె నీ చరితకి
       శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారము కట్టె నీ సీమకి
       సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి
       పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి
                             ||తల ఎత్తి ||
.
||చ|| |అతడు|
       తరతరమ్ములు దాటి తరలివచ్చిన మహాత్ములతపః సంపత్తి నీ వారసత్వం
       ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని ఆంధ్రులకు అందినది ఆర్య సత్వం
       మువ్వన్నె జెండాగ మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ సొంతం
       భారతాంబకు పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం
                             ||తల ఎత్తి ||
.
.
                         (Contributed by Nagarjuna)

Highlights


O Telugoda!
Be proud for being from Telugu land and for your achievements.
Be thankful to Telugu talli for having inherited such an invaluable culture & history.
.
You are connected to all the three regions of Andhra Pradesh (శ్రీకాకుళాంధ్రుడై, శ్రీశైల భీమేశ కాళేశుడై, & శాతవాహనుడు పూర్వజుడు) and also to India.
.
Do your part to keep the tricolor flag flying all around the world.
Be proud of what you inherited and keep on achieving more to live with self repsect!
…………………………………………………………………………………………………

2 Responses to “మహాత్మ: తల ఎత్తి జీవించు తమ్ముడా”

  1. MJ Says:

    Wow!

    I didn’t know till now that there is one more song in ‘Mahatma’ on par with the song ‘indiramma inTi pEru…’.

    This is too good a song. A wake up call to ‘TelugODu’ and a pat in the back to all of us.

  2. sivakanth Says:

    తెలుగు తనాన్ని, తెలుగు వాడినని మర్చిపోతున్న ఈ రొజుల్లో, తన లోని తెలుగుతనాన్ని వెలికితీసే మెలుకొలుపు….ప్రతి తెలుగువాడు గర్వించతగ్గ, గర్వపడాల్సిన పాట ఇది.

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)