|
Context
Song Context:
సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చిందిరో
గంగిరెద్దు ఇంటికొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో
తెలుగిళ్లలోని లోగిళ్ళ లోనికి పెద్దపండగొచ్చింది చూడరో
కిల కిల సందళ్ళతో ఇలా కొత్తపొద్దు తెచ్చింది చూడరో |
Song Lyrics
||ప|| |అతడు|
ఏడు మల్లెలెత్తు సుకుమారికి - ఎంత కష్టం వచ్చింది నాయనో..
భోగి పళ్ళు పొయ్యాలి బేబికి ఏమి దిష్టికొట్టింది నాయనో…
ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెమటలు పట్టాయిరో..
మంచుబొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరో
|| ముగ్గులెట్టు ||
.
||చ|| |అతడు|
పాతమంచమిదిగో పట్టుకొచ్చినానురో భగ్గుమంటు మండుతాదిరో
కోరస్:
పేకతల్లిరో పీకులాడమందిరో సందు చూసి సద్దుకోరో ఓయ్
ఆమె:
బోడిజుట్టు ఉందని కోడిపుంజుకావురో కాలుదువ్విరాకయ్యో
అతడు:
ఎక్కిరించనా ఎంతచక్కకుంటవే.. నా పడచు పావురాయో
ఆమె:
అలా మాయమాటలాడితే ఐసైపోనయ్యో
బలాదూరు మానకుంటే భరతం పడతాడు మా మామయ్య
అతడు:
హరిలో రంగా హరీ .. చూడరో ఈ అల్లరి
అతడు:
గాదెలో నిండే వరి వీధిలో చిందేసిరి
ఆమె:
సువ్వి సువ్వి గొబ్బిళ్ళ పాటకి - నవ్వి నవ్వి తాళాలు వెయ్యరో..
.
||చ|| |అతడు|
ఎంత గోల పెట్టినా నెత్తి మీదకొచ్చెరో కుంకుడు స్నానాలు
ఆమె:
చింత మొద్దులా అంతనిద్దరేందిరా ఏమాయె పౌరుషాలు
అతడు:
ఎముకలు కొరికే ఈ చలికురిమి చెమటలు కక్కించరో…
కోరస్:
ఆ.. మంచుగడ్డిలా ఉండలేనిది మంటపాలు చెయ్యలేవో
అతడు:
ప్రతి ఇంట బూరెల వంట మహబాగుంది సరే…
కోరస్:
కనుమ దాకా కక్కా ముక్కా దొరకదు అది ఒకరోజే కదరో
అందరు:
సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చిందిరో..
గంగిరెద్దు ఇంటికొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో..
తెలుగింట లోగిళ్ళ లోనికి పెద్దపండగొచ్చింది చూడరో
కిల కిల సందళ్ళతో ఇలా కొత్తపొద్దు… తెచ్చింది చూడరో..
|| సంకురాత్రి || || 2 ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
……………………………………………………………………………………………….
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)