|
Context
Song Context:
Interesting debate by friends with విభిన్న జీవిత ధృక్కోణాలతో! |
Song Lyrics
||పల్లవి||
ఆమె:
ఆయిలా ఆయిలా ఆయిలాయి ఆయిలాయిలాయిలాయిలాయిలాయి
అతడు:
లేచిందే లేడికి పరుగు కూచుంటె ఏమిటి జరుగు
తోచిందే వేసేయ్ అడుగు డౌటెందుకూ
అతడు1:
లేడల్లే ఎందుకు ఉరుకు పడిపొతే పళ్ళు విరుగు
చూడందే వెయ్యకు అడుగు జోరెందుకూ
అతడు:
మనకన్నా చిన్నవాళ్ళు మంజ్రేకర్ టెండుల్కర్లు లేరా మనకెగ్జాంపులు
అతడు1:
తుటాలా ఫాస్టు బాలు చూస్తేనే గుండె గుభేలు
మనసత్తా సో సింపులు సో సింపులూ
ఆమె:
ఎవరి జాతకం వారిది సారు రేఖలేనిదే నెగ్గరు ఎవరు
రాసివున్నదా చూసుకో గురూ నేటి స్వీపరే నెక్స్ఠ్ స్పీకరు
లక్కుంటే లకీరుతో లక్ పతిలౌతారు
లైఫంటే నసీబులో స్టారే మాస్టారు
|కోరస్| ||ఆయిలా ఆయిలా ||
.
||చరణం||
అతడు:
తాపీ తాబేలు తీరు ఆపేసే హాల్ట్ బోరు టేకాఫే టాపు గేరు నా నేచరు
అతడు1:
కుందేలై గెంతువారు కుదేలయేతీరుతారు లాకప్ కో హాస్పిటల్ కో గెస్ట్ వుదురు
అతడు:
ట్రైలెద్ఢాం కొండకొనకు పోయేదేముంది మనకు ఆఫ్ట్రాలో వెంట్రుక మన స్టేకు
అతడు1:
ఏదో ఒకటుంది తలకు అది కాస్తా తెంచుకోకు
టోటల్ గా సున్నా అయిపోకు గోవిందా గోవిందా
ఆమె:
ఇంటలెక్చువల్ లెక్చర్లేలేలా అడుగు అడుగునా మేథావుల్లా
మైథాలాజికల్ పిక్చర్లోలా పొడుగు పొడుగునా పద్యాలేల
చర్చలతో చెడామడా తర్జన బర్జనలా జంక్షనులో ఎడాపెడా అర్జున గర్జనలా
|కోరస్| ||ఆయిలా ఆయిలా ||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
[Also refer to Pages 224-225 of సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)