రాజా: మల్లెల వానా మల్లెల వానా నాలోనా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Raja
Song Singers
   Mano,
   Chitra
Music Director
   S.A. Raj Kumar
Year Released
   1999
Actors
   Venkatesh,
   Soundarya
Director
   Muppalaneni Siva
Producer
   R.B. Chaudhary

Context

Song Context:
   మనసంతా మధుమాసంలా విరబూసేనా…
   మైమరిచే ఆనందాలే ప్రతి నిమిషానా!

Song Lyrics

||ప|| |ఆమె|
       మల్లెల వానా మల్లెల వానా నాలోనా
       మనసంతా మధుమాసంలా విరబూసేనా
       మల్లెల వానా మల్లెల వానా నాలోనా
       మనసంతా మధుమాసంలా విరబూసేనా || 2 ||
       కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా
       తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా
       విరిసే అరవిందాలే అనిపించేనా
       మైమరిచే ఆనందాలే ప్రతి నిమిషానా
                                 || మల్లెల వానా ||
.
||చ|| |ఆమె|
       చిన్న చిన్న సంగతులే సన్నజాజి విరిజల్లు
       తుళ్లుతున్న అల్లరులే ముళ్ళు లేని రోజాలు
|అతడు|
       అందమైన ఆశలే చిందులాడు ఊహలే నందనాల పొదరిళ్లు
|ఆమె|
       గుప్పెడంత గుండెలో గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు
|అతడు|
       వన్నెల పరవళ్లు పున్నాగ పరిమళాలు
|ఆమె|
       వయసే తొలి చైత్రం చూసే సమయాన
       మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా
                                        ||మల్లెల వానా||
.
||చ|| |అతడు|
       కొమ్మలేని కుసుమాలు కళ్లలోని స్వప్నాలు
       మొగలి పూల గంధాలు మొదలయేటి బంధాలు
|ఆమె|
       కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే పారిజాత హారాలు
|అతడు|
       ముద్దుగుమ్మ ఎదలో మొగ్గవిచ్చు కథలే ముద్ద మందారాలు
|ఆమె|
       నిత్య వసంతాలు ఈ పులకింతల పూలు
|అతడు|
       ఎపుడూ వసివాడని వనమై హృదయాన
       మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా
                                         ||మల్లెల వానా||
.
.
                        (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)