గుడుంబా శంకర్: చిట్టి నడుమునే చూస్తున్నా

Posted by admin on 18th December 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Gudumba Sankar
Song Singers
   Mallikarjun
Music Director
   Mani Sharma
Year Released
   2004
Actors
   Pavan Kalyan,
   Meera Jasmine
Director
   Veera Sankar
Producer
   Naga Babu

Context

Song Context:
    A love song

Song Lyrics

||ప|| |అతడు|
       చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో ఛస్తున్నా
                         కంటపడదు ఇక ఎదురేమున్నా
       చుట్టు పక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా
                         చెవిన పడదు ఎవరేమంటున్నా
       నడుమే ఉడుమై నను పట్టుకుంటే జాణా
                      అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా
       ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగిచూసైనా
       ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా
.
||చ|| |అతడు|
       నంగనాచిలా నడుమూపి నల్లతాచులా జడచూపి
                              తాకిచూస్తే కాటేస్తానంది
       చీమలాగా తెగ కుడుతుంది పాములాగ పగబడుతుంది
       కళ్లు మూసినా ఎదరే ఉంది
       తీరా చూస్తే నలకంత నల్లపూస
       ఆరా తీస్తే నను నమిలేసే ఆశ
       కన్నెర్రగా కందిందిలా నడుమొంపుల్లో నలిగి
       ఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లొ మునిగి
.
||చ|| |అతడు|
       ఎన్ని తిట్టినా వింటానే కాలదన్నినా పడతానే
                   నడుము తడమనీ నన్నొకసారి
       ఉరిమిచూసినా ఓకెనే ఉరేవేసినా కాదననే
                   తొడిమి చిదిమి చెబుతానే సారీ
       హాయ్రే హాయ్రే ఏ ప్రాణహానీ రానీ
       హాయ్రే హాయ్రే ఇక ఏమైనా కానీ
       నిను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి
       ఆ కోరిక కడతేరగ మరు జన్మ ఎందుకే రాణీ
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)