|
Context
Song Context:
అంతా నా వాళ్ళె!
మనసున మమతలున్న మనిషిని! |
Song Lyrics
||ప|| |ఆమె|
నోరార పిలిచినా పలకనివాడినా
మనసున మమతలున్న మనిషినికానా ||నోరార||
నేలమీద మనలాగే ప్రాణులెన్ని ఉన్నా
పిలిచేందుకు పలికేందుకు
చుట్టరికాలతో చుట్టుకునేందుకు
ఎన్నెన్నో అందమైన వరసలు మనవేలే కన్నా
||నోరార||
.
చరణం:
ఎవ్వరికీ ఏమీ కానీ ఏకాకినై వున్నా
నా పేరు ఇన్నాళ్ళు ఒంటరి సున్నా
అంకుల్ అంటూ నాకు దగ్గరైంది
చిన్ని అంకెలాంటి లేత బంధం
అల్లుడంటు నన్ను అల్లుకుంది
పూలసంకెలంటి అనుబంధం
బావనయ్యాను మరిదినయ్యాను
మావయ్యనయ్యాను మనవణ్ణి అయ్యాను
ఎంతమంది చెంతకొచ్చారో ఎన్ని పేర్ల కొత్త జన్మనిచ్చారో
తీరిపోని రుణమందుకున్నా ఇంతకన్న ధనముండదన్నా
మునుపెరుగని అనుభవమని మైమరపున వున్నా
||నోరార||
.
చరణం:
పదుగురు పంచుకోని ఆనందమేదైనా పచ్చికైనా పెంచలేని ఎడారివాన
ఆడమగ జంట ఆలుమగలుగ మారి అంతే చాలు అంటారా
అమ్మానన్నలుగ అత్తామామలుగ పేర్లుపొందాలనుకోరా
తాతయ్యనవ్వాలి మీసాలు దువ్వాలి అవ్వ నేనవ్వాలి గవ్వలా నవ్వాలి
అనే ఆశ తోడు ఉండగా పైనపడే ఈడు కూడా పండుగ
అయినవాళ్ళు ఉన్న లోగిళ్ళలో ఆయువాగిపోదు నూరేళ్ళతో
తరతరముల తరగని కథ చెబుతుందిరా చిన్నా
||నోరార||
.
.
(Contributed by Prabha) |
Highlights
This one is for the ages!
.
నేలమీద మనలాగే ప్రాణులెన్ని ఉన్నా, ఎన్నెన్నో అందమైన వరసలు మనవేలే కన్నా!
.
ఎంతమంది చెంతకొచ్చారో ఎన్ని పేర్ల కొత్త జన్మనిచ్చారో, తీరిపోని రుణమందుకున్నా ఇంతకన్న ధనముండదన్నా
మునుపెరుగని అనుభవమని మైమరపున వున్నా
.
పదుగురు పంచుకోని ఆనందమేదైనా పచ్చికైనా పెంచలేని ఎడారివాన
.
బంధం అనే ఆశ తోడు ఉండగా పైనపడే ఈడు కూడా పండుగ!
.
అయినవాళ్ళు ఉన్న లోగిళ్ళలో ఆయువాగిపోదు నూరేళ్ళతో
తరతరముల తరగని కథ చెబుతుందిరా చిన్నా
.
[Also refer to Pages 246-247 in సిరివెన్నెల తరంగాలు & pages 53-55 in "నంది" వర్ధనాలు]
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)