సెల్యూట్: నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా

Audio Song:
 
Movie Name
   Salute
Song Singers
   Sadhana Sargam,
   Beney Deyal
Music Director
   Harris Jayaraj
Year Released
   2008
Actors
   Vishal,
   Nayantara
Director
   Rajasekhar
Producer
   Vikram Krishna>

Context

Song Context:
   కోపంలో నిప్పుల కొండలా, రూపంలో చుక్కల దండలా
   నవ్వుల్లో చిలకమ్మలా, చిన్నారుల చేతికి బొమ్మలా
   ఇంతకీ నువ్వొకడివా వందవా? ఎంతకీ నువ్వెవరికీ అందవా?

Song Lyrics

||ప|| |ఆమె|
       నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
       నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా
       కోపంలో నిప్పుల కొండలా రూపంలో చుక్కల దండలా
       నవ్వుల్లో చిలకమ్మలా చిన్నారుల చేతికి బొమ్మలా
       ఇంతకీ నువ్వొకడివా వందవా ఎంతకీ నువ్వెవరికీ అందవా
|ఖోరస్|
       కొత్తగా లవ్ లో పడుతుంటే కొద్దిగా ఇదిలా ఉంటుందే
       ముందుగా మనసుకి తెలిసుందే ముందుకే నెడుతూ ఉంటుందే
       తప్పు కాబోలనుకుంటూనే తప్పుకోలేననుకుంటుందే
       నొప్పిలో తీపి కలొస్తుందే రెప్పలో రేపు మురుస్తుందే
                                      |ఆమె| ||నిన్నేనా నేను ||
.
||చ|| |ఆమె|
       తడవక నడిపే గొడుగనుకోనా అడుగుల సడిలో పిడుగైనా
       మగతనిపించే మగతనమున్నా మునివనిపించే బిగువేనా
       ముళ్లలా నీ కళ్లలా నను గిల్లిపోతున్నవా
       పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నవా
       నాకేమవుతావో చెప్పవ ఇపుడైనా
|ఖోరస్|
       చెప్పమని అడిగేం లాభంలే ఎప్పుడో పొందిన ఆన్సర్లే
       ఉత్తినే వేసే క్వశ్చన్లే ఊరికే తీసే ఆరాలే
       నిదర చెడగొట్టే నేరాలై కుదురుగా ఉంచని తొందరలే
       ధరణిలా అంతా నీ వల్లే అంటు నిలదీసే నిందల్లే
                                      |ఆమె| ||నిన్నేనా నేను ||
.
||చ|| |ఆమె|
       బిత్తరపోయే బెదురొదిలించు కొత్తగ తెగువే కలిగించు
       కత్తెర పదునై బిడియం తెంచు అత్తరు సుడివై నను ముంచు
       చెంప కుట్టే తేనెపట్టై ముద్దులే తరమనీ
       చెమటపుట్టే పరుగు పెట్టి హద్దులే కరగనీ
       అని అడగాలన్నా అడిగెయ్ లేకున్నా
                                    |ఖోరస్| ||చెప్పమని అడిగేం ||
                                    |ఆమె| ||నిన్నేనా నేను ||
.
.
                             (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)