Posted by admin on 15th January 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
||ప|| |ఆమె|
థంసప్ థండరుకైనా దడదడ పుట్టించేలా
పిడుగై దూకే నడకే చూశా మహరాజా
|అతడు|
ఎవరెస్ట్ మౌంటెన్ నైనా గడగడలాడించేలా
తడి సోకుల్లో తళుకే చూశా నవరోజా
||థంసప్ ||
|ఆమె|
అడిగిందడిగినట్టు ఇస్తా ఒడిలో విడిది చెయ్యనిస్తా
జతగా ఉండిపో హమేషా
|అతడు|
ఉసి కొట్టకలా కలహంస పసి వయసుకెందుకే హింస
మొదలెట్టానంటే ఆగదు నా ధింసా
.
||చ|| |ఆమె|
కన్యాదానమిచ్చా కళ్యాణంలో కానుకిస్తా ఏకాంతంలో
కమ్ముకుంటే అమ్మో అంటానా
|అతడు|
వయ్యారాలు మెచ్చే వ్యామోహంలో మత్తు పెంచే మాలోకంలో
పైకి తేలే మార్గం తెలిసేనా
|ఆమె|
తెల్లారే దాకా తేలవా అల్లాడే ఆత్రం చూడవా
కళ్లారా చూస్తూ కాలక్షేపం చేస్తావా
|అతడు|
ఈ కనికట్టేదో మానవా నన్నిట్టే కట్టే మాయవా
నీ మెలికల్లో ముడి వదిలేశాక దేఖో నా వరసా
||ఉసి కొట్టకలా|| || థంసప్ ||
.
||చ|| |ఆమె|
కొంచెం సాయమిస్తే సావాసంగా ప్రాయమిస్తా సంతోషంగా
సోయగం నీ సొంతం చేస్తాగా
|అతడు|
ఇట్టా సైగ చేస్తూ సమ్మోహంగా స్వాగతిస్తే సింగారంగా
స్వీకరిస్తా మహదానందంగా
|ఆమె|
ముస్తాబై వచ్చా ముద్దుగా మైమరపిస్తా మరి కొద్దిగా
నువ్ సరదాపడితే సిద్ధంగానే ఉన్నాగా
|అతడు|
గమనిస్తున్నానే శ్రద్ధగా కవ్విస్తుంటే సరికొత్తగా
పెదవేలే పదవే ఇస్తానంటే ఇదిగో వచ్చేశా
||ఉసి కొట్టకలా || ||థంసప్||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)