| 
 | 
 Context 
Song Context: 
     జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా 
     నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లడిపొదా రేయి ఆపుమా 
  | 
 
| 
 Song Lyrics 
||ప|| |ఆతడు| 
       జాబిలమ్మ నీకు అంత కోపమా 
       జాజిపూల మీద జాలి చూపుమా ||జాబిలమ్మ|| 
       నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే 
       అల్లడిపొదా రేయి ఆపుమా 
                                     ||జాబిలమ్మ|| 
. 
చరణం: 
       చిగురు పెదవిపైన చిరునవ్వై చేరాలనుకున్నా 
       చెలియమనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా 
       ఉన్నమాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా 
       హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమకాంతి కనపడలేదా 
       మరీ అంత దూరమా కలలు కన్న తీరమా 
                                     ||జాబిలమ్మ|| 
. 
చరణం: 
       మనసు చూడవమ్మా కొలువుందో లెదో నీ బొమ్మ 
       మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా 
       ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా 
       తోడుకోరి దగ్గరైతే దోషమా తీయనైన స్నేహమంటె ద్వేషమా 
       ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా 
                                     ||జాబిలమ్మ|| 
. 
. 
                 (Contributed by Venkata Sreedhar)  | 
 
| 
 Highlights 
   చిగురు పెదవిపైన చిరునవ్వై చేరాలనుకున్నా 
   చెలియమనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా 
   తోడుకోరి దగ్గరైతే దోషమా తీయనైన స్నేహమంటె ద్వేషమా 
   ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా 
. 
[Also refer to Page 218 in సిరివెన్నెల తరంగాలు] 
………………………………………………………………………………………………..  | 
 
 
 | 
					
				 
				  
		
	
			
	 
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)