Posted by admin on 29th January 2010 in
ప్రేమ
|
Context
Song Context:
ఓ యుగళ గీతం
|
Song Lyrics
||ప|| |ఆమె|
ఓ మన్మధ విన్నా కదా తమ తుమ్మెద ఝుంకారం
తన సంపద అందించదా చెలి వన్నెల మందారం
అతడు:
ఓ పూపొదా చూస్తా కదా సుతిమెత్తని సుకుమారం
నీ ఆపద నేనాపెద పద అన్నది శృంగారం
ఆమె:
మతి చెడిపోయే మంత్రంలా సొగసులు సంధిస్తా
సుఖపడిపోయే బంధంలో సులువులు నేర్పిస్తా
||ఓ మన్మధా||
.
చరణం: అతడు:
గాజులతో ఘల్లుమని విరజాజులతో ఘొల్లుమని
కౌగిలినే అల్లుకుని కలవరపడని కన్నెధని
ఆమె:
కోమలినే కమ్ముకుని కోరికతోనే కొరికితిని
గుసగుసలే గుచ్చుకుని విలవిలమనని వెన్నెలని
అతడు:
సురసుఖాల వైపు నడపని సుమకుమారిని
ఆమె:
సరస రాజధాని తెలుపని చిలిపి లీలని
అతడు:
కడలిఒడిలో కలికి పగడం కరిగి నీరవని
||ఓ మన్మధా||
.
చరణం: ఆమె:
తగు వరసే బిగిసెనుగా పూలత కోరే పందిరిగా
అణువణువూ విరిసెనుగా పెనిమిటిగా నినుపొందాకా
అతడు:
మగ వయసే ఎగసెనుగా నినుపెనవేసే తొందరగా
నెమ్మదిగా ఉండదుగా నివురొదిలాక నిప్పు సెగ
ఆమె:
కలువ కంటిపాప కాపలా కదలనీదుగా
అతడు:
అడగలేద నిన్ను విడుదల చెలిమి సంకెల
ఆమె:
లతకు జతవై నడుపుకోవ నన్ను కడదాకా
||ఓ మన్మధా ||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)