Posted by admin on 2nd April 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song!
|
Song Lyrics
సాకి: అతడు:
అమ్మాయిగారు అమ్మాయిగారు ఒట్టేసి చెప్పండమ్మాయిగారు
ఆమె: ఏంటది అతడు: అందరిలా చూడరుగా నన్ను మీరు
ఆమె: అంటే? అతడు: ఆ.. ఏదో నాకు తోచింది మంచో చెడ్డో చేసేస్తుంటాను గదా
ఆమె: అయితే? అతడు: అయినా నా మీద కోపం వస్తుందా మీకు?
ఆమె: రాదులే అతడు: అంటే
ఆమె: అంటే అతడు: నేనంటే
ఆమె: నువ్వంటే అతడు: మీకెంతో
ఆమె: నాకెంతో అతడు: ఇష్టమన్నమాట
.
పల్లవి: అతడు:
ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు ఏదీ అది అమ్మాయిగారు
ఆమె:
చెప్పాలి ఏంకావాలో మీరు ఏదో అది అబ్బాయిగారు
అతడు:
నన్నే మెచ్చారు నేనే నచ్చానన్నారు
తీరా అది ఇమ్మంటే ఇంకా ఏదో అలోచిస్తారు
ఆమె:
చాల్లే నీ తీరు విన్నాళ్ళేమనుకుంటారు
అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో ఓ పేరు
అతడు:
ఆ మాట నా నోట ఈ పూట వినిపించనా
ఐ వాంట్ ఎ కిస్ ఫ్రం యు.
||ఇవ్వాలి||
.
చరణం: అతడు:
ఎదురయ్యారా ఇష్టం అయిన వాళ్ళు అది కావాలంటారంటగా
ఆమె:
ఎద గూటిలో చోటిచ్చాగా నీకు ఋజువింకా చూపాలంటావా
అతడు:
ఏమో గాని అది ఎక్కడుంది మీరేమనుకోనంటే నేనే వెళ్ళి తెచ్చుకుందునా
ఆమె:
ఓహో వాటం మహ జోరుగుంది పోని పాపం అంటే నీ మోమాటం రెచ్చిపోయెనా
అతడు:
అంటె కాదన్నట్టా ఔనన్నట్టా తేల్చకుండా అట్టా నవ్వుతుంటే ఎట్టాగమ్మా
||ఇవ్వాలి|
.
చరణం: ఆమె:
పసి పాపలా పంతం పట్టావంటే కొరికేస్తా రెండు బుగ్గలూ
అతడు:
అలవాటుగా ఒప్పొ తప్పొ అంటే కొడతారా చెంపదెబ్బలూ
ఆమె:
అబ్బా అదేంకాదు వెర్రినాయనా ఏమీ అర్ధం కాదేమయ్యా నీకు ఎట్టా చెప్పినా
అతడు:
ఇచ్చేదేదో ఇస్తే సంతోషించనా ఉట్టి మాటల్తోనే ఊరిస్తుంటే ఊరుకుందునా
ఆమె:
అంత బాహాటంగా అడిగేస్తావెం బండరామయ్యా ఇదేం కాయా పండా నువ్వే చెప్పయ్యా
అతడు:
నాకేం తెలుసండీ
||ఇవ్వాలి||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)