Posted by admin on 19th February 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song! |
Song Lyrics
||ప|| |ఆమె|
మది లయలో కథకళివో
మదనపడే నాలో అలజడివో
|అతడు|
తొలకరి మెరుపే తగిలినదేమో
తలవని తలపై వెంటాడే తొలి వలపేమో
||మది లయలో||
.
||చ|| |ఆమె|
పరుగులు ఆపే పరవశమా
పలుకులు నేర్పే ప్రియస్వరమా
మైకం తమవలనేమో
|అతడు|
నీ సంగతి నీకే ఎరుకా
నేనేం చెబుతా చిలకా
నాకేమీ తెలియదు గనక
అడగకే జాలిగా
|ఆమె|
జరిగినది ఇది అని ఎవరికి తెలుసునట
|అతడు|
తొలకరి మెరుపే తగిలినదేమో
తలవని తలపై వెంటాడే తొలి వలపేమో
|| మది లయలో ||
.
||చ|| |అతడు|
లీలగా సాగే వేడుకలో
వీలుగ లాగే వెల్లువలో
పడిపోయా తలమునకలుగా
|ఆమె|
లోలో కల కలవరమింకా
నీలో మొదలవలేదే
లైలా వల మెలివేశాక
నిలకడే ఉండదే
|అతడు|
తదుపరి మలుపులు ఎటు మరి మన కథలో
|| మది లయలో ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)