Posted by admin on 5th March 2010 in
ప్రేమ
|
Context
Song Context:
ఓ యుగళ గీతం
|
Song Lyrics
||ప|| |అతడు|
నీ చిరునవ్వులు వెదజల్లెను సిరిమల్లెల విరిజల్లు
నీ కులుకుల నడకల తనువే ఇల విరిసిన హరివిల్లు
ఓ అందాలబాల మకరందాలు గ్రోల నే వాలేనే నీ మ్రోల
ఆమె:
నీ జతకోరిన సుమబాలను జత దళమున విరిసేను
ఘుం ఘుంమనే నీ పిలుపే పులకింతలు రేపేను
ఓ కొంటే తేటి రాజా ఈ కన్నేలేత రోజా నే వేచేను రారాదా
.
||చ|| అతడు:
నీ నీలికన్నుల్లో మెనిమెని వన్నెల్లో
జాలువారు వెన్నెల్లో నేను తేలు వేళల్లో
ఆమె:
కోరుకున్న జాబిల్లి చేరుకున్న రోజుల్లో
వేడి వేడి కౌగిళ్ళో తీరుతున్న మోజుల్లో
అతడు:
నేను తానా అందాల ఆనంద నందనాలే
||నీ జతకోరిన||
.
||చ|| ఆమె:
పంటి గాటు వేశావు తీపిమంట రేపావు
గుండెలోని మధువంతా దోచి దాచుకున్నావు
అతడు:
ఓరకంట చూశావు మోహమేదో రేపావు
ఆరనీవే తాపాలు తీరనీవే దాహాలు
ఆమె:
ఈనాడు ముడివేశే విడిపోని బంధనాలు
||నీ చిరునవ్వులు||
.
.
(Contributed by Dr. Jayasankar) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)