దోషి నిర్దోషి: మనసు మరిగి శిలలే కరిగే ఈ రామాంజనేయ సమరంలో

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Doshi Nirdoshi
Song Singers
   S.P. Balu
Music Director
   Vidyasagar
Year Released
   1990
Actors
   Shobhan Babu,
   Suman,
   Lizi
Director
   Y. Nageswara Rao
Producer
   D.V.S Raju

Context

Song Context:
     ఈ రామాంజనేయ సమరంలో, ఈ శ్రీకృష్ణార్జున యుద్ధంలో
     దోషి ఎవ్వరు? నిర్దోషి ఎవ్వరు?

Song Lyrics

||ప|| |అతడు|
       మనసు మరిగి శిలలే కరిగే ఈ రామాంజనేయ సమరంలో
       సెగలు రగిలి చెలిమే చెరిగే ఈ శ్రీకృష్ణార్జున యుద్ధంలో ||మనసు||
       దోషి ఎవ్వరు నిర్దోషి ఎవ్వరు తెగదు ఈ వివాదం విధికిదేం వినోదం
.
చరణం: అతడు:
       I, Shiva Shankar, having been appointed as Judge
       Do swear in the name of God
       that I will perform the duties of my office
       without fear, favour, affection
.
కోరస్:
       ధర్మేచ అర్థేచ కామేచ త్వయేషా నాతిచరితవ్యాహ్ నాతిచరామి
అతడు:
       కాటేయమనే కర్తవ్యం కాపాడమనే బాంధవ్యం
       ఏది గెలిచినా ఎదకు తప్పునా మాయని పెనుగాయం ||కాటేయమనే||
       ధర్మనిర్ణయం చేయగలుగునా ఆత్మసాక్షి సైతం
       మంచికి మమతకు ఎటుమొగ్గాలో చెప్పదు ఈ శూన్యం
       కన్న తండ్రి కంటి నీటిలో నీతి కరిగిపోవాలా
       న్యాయమూర్తి కలంపోటుతో వంశనాశనం జరగాలా
       తెగదు ఈ వివాదం విధికిదేం వినోదం దోషి ఎవ్వరు నిర్దోషి ఎవ్వరు
.
చరణం: అతడు:
       వికటించిన విధి ఆడించిన ఈ చదరంగంలో
       అయినవాళ్ళే అటు ఇటు ఈ రణరంగంలో ||వికటించిన||
       సత్యాసత్యములకు మధ్య నిత్య కురుక్షేత్రం
       పార్ధుని ఎదలో విషాద యోగం ఈ ధర్మక్షేత్రం
       బాటచూపు భగవద్గీతే అవినీతిని బోధిస్తే
       భగవానుడి రథసారధ్యం పాపం వైపే నడిపిస్తే
       దోషి ఎవ్వరు నిర్దోషి ఎవ్వరు తెగదు ఈ వివాదం విధికిదేం వినోదం
                                                 ||మనసు||
.
.
                       (Contributed by Prabha)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)