|
Context
Song Context:
ఇకపైన ఏనాడు కడలి ఒడిలోకి పడీపోకు అలిసే అలా
అని నన్ను ఆపింది ఆ నింగి జాబిల్లి నా చేతికందింది ఇలా! |
Song Lyrics
||ప|| |అతడు|
దిక్కుల్నే దాటింది ఆనంద తాండవం
ఉప్పొంగి దూకింది ఊహాల నర్తనం
మబ్బుల్నే మీటింది మదిలోని నీ మహోత్సవం
హరివిల్లై విరిసింది ఆశల నందనం
మిణుకుమిణుకుమని తళుకులొలుకు తారలతో ఆకాశం
చినుకుచినుకునై కరిగి కరిగి దిగివచ్చే నా కోసం
||దిక్కుల్నే||
.
||చ|| |అతడు|
నలుపొకటే కొలువున్నా కనుపాపలో ఇలా
తొలిసారి ఈ వేళా ఎన్నెన్ని వర్ణాలో ||2||
తన చెలిమి కొనవేలు అందించి ప్రియురాలు నడిపింది తనవైపిలా
ఈ దివ్యలోకాలు ఈ నవ్యస్వర్గాలు చూపింది నలువైపులా
ఎదురై పిలిచే అనురాగాల యదకోయిలా
బదులై పలికే మదివేగాన్నీ నిలిపేదెలా
||దిక్కుల్నే||
.
||చ|| |అతడు|
వడగాలే విడిదైనా యద లోయలో ఇలా
పూదోట విరిసేలా… పన్నీటి వర్షాలా ||2||
ఇకపైన ఏనాడు కడలి ఒడిలోకి పడీపోకు అలిసే అలా
అని నన్ను ఆపింది ఆ నింగి జాబిల్లి నా చేతికందింది ఇలా
వలపే బిగిసే అనుబంధాల ఈ సంకెల
వరదై ఎగిసే మధుభావాలు తెలిపేదెలా
||దిక్కుల్నే||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)