|
Context
Song Context:
మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించదా
బంగారు భావాల ప్రియగీతం రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా! |
Song Lyrics
కొరస్:
తళక్ తళక్ అని తళకుల తార
మిణక్ మిణక్ అని మిల మిల తార
ఛమక్ ఛమక్ అని మెరిసే సితారా
|| తళక్||
.
||ప|| ఆమె:
మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించదా
బంగారు భావాల ప్రియగీతం రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా
|కొరస్| ||తళక్||
||మనసున్న కనులుంటే||
.
చరణం: ఆమె:
అలలై ఎగసిన ఆశ నాట్యం చేసే వేళ
ఆలుపే ఎరుగని శ్వాస రాగం తీసే వేళ
దిశలన్ని తలవొంచి తొలగే క్షణం
ఆకాశం పలికింది అభినందనం
అదిగదిగో మనకోసం తారాగణం
తళుకులతో అందించే నీరాజనం
మనదారికి ఎదురున్నదా
||మనసున్న కనులుంటే||
.
చరణం: ఆమె:
నవ్వే పెదవులపైన ప్రతి మాట ఒక పాటే
ఆడే అడుగులలోన ప్రతి చోట పూబాటే
గుండెల్లో ఆనందము కొలువున్నదా ఎండైనా వెన్నెల్ల్లా మురిపించదా
కాలాన్నే కవ్వించే కళ ఉన్నదా కష్టాలు కన్నీళ్ళు మరిపించదా
జీవించడం నేర్పదా
||మనసున్న కనులుంటే||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)