|
Context
Song Context:
ప్రకృతిలో ప్రణయం రేగనిదే చిగురుతొడగవా ప్రేమా? |
Song Lyrics
||ప|| |అతడు|
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా||2||
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా
వలపుల వనమా వెలుగుల వరమా
ఈ ఎదలో కొలువుందువు రావమ్మా
|| ప్రేమా ప్రేమా||
.
చరణం: అతడు:
ఎంత మధనమో జరగకుండా ఆ పాల కడలి కదిలిందా అమృతకలశమందిందా
ఎన్ని ఉరుములో విసరకుండా ఆ నీలినింగి కరిగిందా నేలగొంతు తడిపిందా
ప్రతి క్షణం హృదయం అడగనిదే చలువనీయవా ప్రేమా
ప్రకృతిలో ప్రణయం రేగనిదే చిగురుతొడగవా ప్రేమా
అణువణువు సమిధలయే ఈ యాగం శాంతిచేదెపుడమ్మా
|| ప్రేమా ప్రేమా||
.
చరణం:
ఆయువంతా అనురాగ దేవతకి హారతీయదల్చాడు ఆరిపోతూ వున్నాడు
మాయమైన మమకారమేది అని గాలినడుగుతున్నాడు జాలి పడవా ఈనాడు
నిలువునా రగిలే వేదనలో విలయజ్వాలలు చూడు
ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమిజోలలు పాడు
నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమౌతాడోనమ్మా
|| ప్రేమా ప్రేమా ||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)