|
Context
Song Context:
భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా
రసతరంగ నీ లీల యతిని నృత్య రతుని చేయగలిగే ఈ వేళ |
Song Lyrics
||ప|| |ఆమె|
భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా!
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశా!
నీలకంధరా, జాలి పొందరా! కరుణతో నను గనరా!
నేలకందరా, శైలమందిరా! మొఱ విని బదులిడరా!
నగజామనోజ, జగదీశ్వరా! బాలేందుశేఖరా, శంకరా!
|| భరత ||
.
||చ|| |ఆమె|
అంతకాంత, నీ సతి అగ్నితప్తమైనది
మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది!
ఆదిశక్తి ఆకృతి, అద్రిజాత పార్వతి
స్థాణువైన ప్రాణధవుని చెంతకి చేరుకున్నది!
భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా
రసతరంగ నీ లీల యతిని నృత్య రతుని చేయగలిగే ఈ వేళ
.
||చ|| |ఆమె|
వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా
యోగివేశ నీ మనసున కలగదా రాగలేశమైనా?
హే!మహేశ నీ భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన
నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాధ ప్రథమనాద శ్రుతి వినవా!
.
. |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
August 17th, 2010 at 6:39 am
Hi,
రసతరంగిణి should be రసతరంగ నీ లీల…
Also, i think, in the line,
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాధ ప్రథమనాద శ్రుతి వినవా!, the end should be వినరా.
Please confirm the second one but the first is for sure. Please correct.
Do we have all the songs of Guruji published? It has been a while since we have new songs added. Any particular reason?
Regards,
Sri Harsha.
August 19th, 2010 at 2:05 am
Sri Harsha,
I agree with your first fix. There is lot more to fix/add in this song. Please follow this thread for more comments on this song and post: http://www.orkut.com/Main#CommMsgs?cmm=552390&tid=5314849912577123566&na=4&nst=158&nid=552390-5314849912577123566-5465073239659369706
February 21st, 2012 at 5:38 am
[...] ఈ చర్చ అంకురించటానికి (సిరివెన్నెల భావలహరి జాలగూటి స్థాపన ద్వారా) కారణమైన [...]