ఇష్టం: నువ్వంటే ఇష్టమని నీక్కూడా తెలుసు కదా

Audio Song:
 
Movie Name
   Ishtam
Song Singers
   Hariharan,
   Chitra
Music Director
   D.J. Gopinath
Year Released
   2001
Actors
   Charan,
   Shriya
Director
   Vikram - Raj Kumar
Producer
   Ramoji Rao

Context

Song Context:
     నాకెప్పటి నుంచో అంతో ఇంతో తెలుస్తూ ఉన్నా పట్టించుకోలేదే!
     (A sirivennela-stamped love song!)

Song Lyrics

||ప|| |అతడు|
       నువ్వంటే ఇష్టమని నీక్కూడా తెలుసు కదా
       ఆ ఇష్టం పేరిదని స్పష్టంగా లేదు కదా
       పొన్లే అని ఊరుకుని ఒదిలేస్తే తప్పు కదా
       ప్రేమ ఇట్టా ఉంటుందంటే ఇదీ అదే కదా
                 |ఆమె| ||నువ్వంటే ఇష్టమని||
.
||చ|| |అతడు|
       రెప్పలు వాలే చూపుల్లో వెతుక్కోనా
       చెప్పక దాచే ఊసేదో కనుక్కోనా
|ఆమె|
       అసలెప్పటినుంచో మనస్సులో మెదులుతూ ఉన్నా గమనించనేలేదే
|అతడు|
       నాకెప్పటి నుంచో అంతో ఇంతో తెలుస్తూ ఉన్నా పట్టించుకోలేదే
|ఆమె|
       ఇప్పుడో అప్పుడో అంటూ వేచి చూస్తున్నా
|అతడు|
       మిణుగురులాగా మారనా ఎదలొ తిరిగి చూడనా
|ఆమె|
       నీ రూపమే కదా ఎదురవుతుంది అక్కడా
                        |అతడు| ||నువ్వంటే ఇష్టమని||
.
||చ|| |ఆమె|
       ఇద్దరి మధ్య ఏముందో తెలుస్తున్నా
       బయటకి రాదే మాటల్లో వినాలన్నా
|అతడు|
       ఇది ప్రేమికులంతా ఎదుర్కొనే సమస్యేనేమో
       అతి సహజమేనేమో
|ఆమె|
       అది నిజమే అయితే మరింక ఏమనాలో ఏమో
       మన కధ ప్రేమే నేమో
|అతడు|
       ప్రేమే అయితే పేచి లేదుగా మనకి
|ఆమె|
       అవునని మనసు నమ్మినా పలకవు ఎంత అడిగినా
|అతడు|
       నా గుండె లయలలో సందడి నిన్ను తాకగా
                   |ఆమె| ||నువ్వంటే ఇష్టమని||
.
.
                   (Contributed by Geetha)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)