|
Context
Song Context:
కాన్వెంటులో కాలేజ్ లో ఏం నేర్చుకున్నాం మనమసలు
ఫుట్ పాత్ లో ఫుడ్ వేటలో నా అక్షరాభ్యాసం మొదలు!
|
Song Lyrics
||ప|| |అతడు|
కాన్వెంటులో కాలేజ్ లో ఏం నేర్చుకున్నాం మనమసలు
ఫుట్ పాత్ లో ఫుడ్ వేటలో నా అక్షరాభ్యాసం మొదలు
అడుగు అడుగు ఒక అవసరం విషమ పరీక్షలె అనుదినం
ఎదురు పడిన భేతాళ ప్రశ్నలకు బదులు పలకనిదె కదలవు ముందుకు
బ్రతుకు బళ్ళో చదువంటే వరద వొళ్ళో ఎదురీతే
||కాన్వెంటులో||
.
||చ|| |అతడు|
ఎంత కష్టపడి సొంత తిండి తిని ఆకల్లో రుచి తెలుసుకున్నా
కటికనేల పడి ఒళ్ళు అలిసి నిదరోయే హాయిని కలుసుకున్నా
జన్మలోనే తొలిసారి చెమట పరిమళాన్ని చూస్తున్నా
ఫ్రీడం మన పాలసి మనమే మన ఫాంటసి
ఎవ్వరి వెనుకనో నీడగ నిలబడి పడుండాలా మనం
యవ్వన తరుణము రవ్వలు చిందితె తలొంచాలీ జనం
కేరాఫ్ గాళ్ళుగ బ్రతకమురా -
Yes! We have our own Dress and Address
||కాన్వెంటులో||
.
||చ|| |అతడు|
చేజారాకే తెలిసింది గతకాలంలోని సౌందర్యం
దూరం నుంచి పిలిచింది అనుబంధంలోని మాధుర్యం
మార్గం మన మొండితనం దీపం మన గుండెబలం
కోరిన విలువలు చేతికి దొరకవ అదీ చూద్దాం ఛలో ఛలో
జారిన వెలుగులు తళ తళ వెలగవ జ్వలించే కళ్ళలో
రేయే తెలియని సూర్యుడినౌతా మాయే తగలని మెలకువ నౌతా
||కాన్వెంటులో||
.
.
(Contributed by Vamsi) |
Highlights
కాన్వెంటులో కాలేజ్ లో ఏం నేర్చుకున్నాం మనమసలు
ఫుట్ పాత్ లో ఫుడ్ వేటలో నా అక్షరాభ్యాసం మొదలు
.
ఎంత కష్టపడి సొంత తిండి తిని ఆకల్లో రుచి తెలుసుకున్నా
కటికనేల పడి ఒళ్ళు అలిసి నిదరోయే హాయిని కలుసుకున్నా
జన్మలోనే తొలిసారి చెమట పరిమళాన్ని చూస్తున్నా
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)