|
Context
Song Context:
Wake up from sleep! Light up your lives! |
Song Lyrics
||ప|| |అతడు|
తెల్లారింది లెగండోయ్ కొక్కొరోక్కో ||2||
మంచాలింక దిగండోయ్ కొక్కొరోక్కో
పాములాంటి సీకటి పడగ దించి పోయింది
భయం లేదు భయం లేదు నిదర ముసుగు తీయండి
సావు లాంటి రాతిరి చూరు దాటి పోయింది
భయం లేదు భయం లేదు సాపలు చుట్టేయండి
ముడుసు కున్న రెక్కలిడిసి పిట్ట సెట్టు ఇడిచింది ||2||
మూసుకున్న రెప్పలిడిచి చూపు లెగర నీయండి
||తెల్లారింది||
.
||చ|| |అతడు|
చురుకు తగ్గిపోయింది సెందురుడి కంటికి
చులకనై పోయింది లోకం సీకటికి
కునుకు వచ్చి తూగింది సల్లబడ్డ దీపం
ఎనక రెచ్చి పోయింది అల్లుకున్న పాపం
మసక బారి పోయిందా చూసేకన్ను
ముసురు కోదా మైకం మన్నూ మిన్ను
కాలం కట్టిన గంతలు తీసి కాంతుల ఎల్లువ గంతులు ఏసి
||తెల్లారింది||
.
||చ|| |అతడు|
ఎక్కిరించు రేయిని సూసి ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుబెట్టి యిసిరిందా సూరీడి సూపుల బాణం
కాలి బూడిదై పోదా కమ్ముకున్న నీడ
ఊపిరితొ నిలబడుతుందా సిక్కని పాపాల పీడ
సె(వట బొట్టు స(వురుగా సూరీణ్ణి ఎలిగిద్దాం
ఎలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
వేకువ శక్తుల కత్తులు దూసి - రేతిరి మత్తును ముక్కలు సేసి
||తెల్లారింది||
.
.
(Contributed by Venu) |
Highlights
Only solo public song, sung by Sirivennela garu, so far!
Extremely powerful message in rural slang, yet by a very intelligent character!
Highly figurative with very insightful message!
………………………….
LINE BY LINE MEANING FOLLOWS:
Wake up & Get out of your beds!
Snake like darkness has left, withdrawing its “పడగ”!
No fear! No fear! Get out of your sleep!
Death like night has left the terrace!
No fear! No fear! Fold up your beds!
By opening its folded wings, the bird has left the tree!
Open your closed eye lids, Look at your world!
.
The power for the moon’s eyes has diminished!
The world has become a slave to the darkness!
The lamp itself is dozing in cold air!
The “bad” is roaring in the back!
Did the looking eyes get shielded?
Even the earth and sky might fall in this trap!
By removing the shields to the eyes banded by “the time”, Let “the light” roar back into your life!
.
The sky has turned red looking at the mocking night!
Did the Sun shoot the arrows of rays with perfect aim!
Let “the bad” be burnt up in those rays!
Will the “bad” still breathe?
Let us light up the sun by making our sweat as oil!
Let us make the “ఎలుగు చెట్టు” blossom with “అగ్గిపూలు”!
(Let us light up our lives!)
Let the swords of awakening power in ourselves destroy the trap of darkness!
………………………………
[Also refer to Page 180 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
May 4th, 2010 at 10:41 am
light braught me darkness again annaaru keats, tellaarimdi legamDoy amTunnaaru sastri gaaru , prema vyaktigatamavaDaanikii vyavastaaparamavaDaanikii madya teDa EmO idi… three cheers to sastri gaaru
May 4th, 2010 at 11:35 pm
Srinivasa Rao garu,
Keep your comments coming, for other songs as well! That gives us more Kick!