Search Results

గోల్కొండ హైస్కూల్: ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం

Audio Song:
 
Video Song:
 
Video Comments by Cricketers:
 
Movie Name
   Golkonda High School
Song Singers
   Hema Chandra
Music Director
   Kalyan Malik
Year Released
   2011
Actors
   Sumanth,
   Swathi
Director
   Mohan Krishna Indraganti
Producer
   Ram Mohan Paruvu

Context

Song Context:
   ఆలోచన కన్నా త్వరగా..అడుగేద్దాం ఆరంభంగా!
   ఇదిగొ నీ దారిటు ఉందని సూరిడిని రా రమ్మందాం!

Song Lyrics

పల్లవి: |అతడు|
       ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం
       నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకు అదే తొలి పాఠం
       మునివేళ్ళతొ మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం
       పసివాళ్ళలా ఈ మట్టిలో ఎన్నాళిలాగ పడిఉంటాం
       కునికే మన కనురెపల్లొ వెలిగిద్దాం రంగుల స్వప్నం
       ఇదిగొ నీ దారిటు ఉందని సూరిడిని రా రమ్మందాం
       జాగో జాగొరే జాగొ ||3||
.
చరణం 1: |అతడు|
       ఆకాశం నుండి సూటిగా దూకేస్తే ఉన్నపాటుగా
       ఎమౌతానంటూ చినుకు అలా ఆగిందా బెదురుగా
       కనుకే ఆ చినుకు ఏరుగా.. ఆ ఏరే వరద హోరుగా
       ఇంతింతై ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా
       సందేహిస్తుంటే అతిగా.. సంకల్పం నెరవేరదుగా
       ఆలోచన కన్నా త్వరగా..అడుగేద్దాం ఆరంభంగా
       జాగో జాగొరే జాగొ ||6||
.
చరణం 2: |అతడు|
       ఏ పని మరి ఆసాద్యమేం కాదే ఆ నిజం మహా రహస్యమా
       వేసే పదం పదం పదే పదే పడదొసే సవాళ్ళనే ఎదుర్కోమా
       మొదలెట్టక ముందే ముగిసే కధ కాదే మన ఈ పయనం
       సమరానికి సై అనగలిగే సంసిద్దత పేరే విజయం
       జాగో జాగొరే జాగొ ||3||
.
.
                             (Contributed by Sai)

Highlights

       ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం
       నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకు అది తొలి పాఠం

………………………………………………………………………………………………..