Movie Name
Nee Sneham Song Singers K.K. Music Director R.P. Patnaik Year Released 2002 Actors Uday Kiran, Aarti Agarwal,
Jatin Director Paruchuri Murali Producer M.S. Raju
Context
Song Context:
His best friend, since childhood, who also long ago saved his life, is marrying his lover. Moreover she is also in love with him! Now he is struggling with himself to bless them.
Song Lyrics
||ప|| |అతడు|
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయట పడిపోకుమా
చెయ్యెత్తి దీవించే వేళా నీ కళ్లలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా!!
||ఊరుకో||
.
||చ|| |అతడు|
చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది
జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది
జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత ఏ కంటిదో..మమత ఏ కంటిదో
చెప్పలేనన్నదీ చెంప నిమిరే తడీ
చెయ్యెత్తి దీవించే వేళా నీ కళ్లలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా!!
.
||చ|| |అతడు|
దేహమే వేరుగా స్నేహమే పేరుగా
మండపం చేరనీ మమకారం
పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా
అంకితం చెయ్యనీ అభిమానం
నుదుటిపై కుంకుమై మురిసిపో నేస్తమా
కళ్లకే కాటుకై నడిచిపో స్వప్నమా
చెయ్యెత్తి దీవించే వేళా నీ కళ్లలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా!!
||ఊరుకో||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
కలత ఏ కంటిదో..మమత ఏ కంటిదో,
చెప్పలేనన్నదీ చెంప నిమిరే తడీ!
. Also compare this song with ప్రియమైన నీకు: మనసున ఉన్నది (Male version) where the love happened first between the boy/girl and then the groom became a friend!; so the lyrics are based on the ప్రేమ as the key root. But here it is exactly the opposite sequence of events happened i.e. the groom is a childhood closet friend. So the lyrics (concept) are based on the స్నేహం as the key root.
. Folks that is what is called Sirivennela’s precision! …………………………………………………………………………………………….
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world