|
Song (Female) Lyrics
Context: Girl is shy to express love to him
(నా ప్రియమైన నీకు……., తెలపకపోతే ఎలా!)
.
||ప|| |ఆమె|
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా?
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా?
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా?
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా?
ఒకసారి దరిచేరి యద గొడవేమిటో
తెలపకపోతే ఎలా! ||మనసున||
.
||చ|| |ఆమె|
చింత నిప్పైన చల్లగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలచుకునే వేడిలో
ప్రేమ అంటేనే తీయని బాధని లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలొ
కనపడుతోందా నా ప్రియమైన నీకు నా యద కోత అని అడగాలనీ
అనుకుంటూ తన చుట్టూ మది తిరిగిందనీ తెలపకపోతే ఎలా
||మనసున||
.
||చ|| |ఆమె|
నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింకా చోటెక్కడుందని
నిదరే కసురుకునే రేయిలో
మేలుకున్నాయి ఏం వింత కైపని వేల ఊహల్లో ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతేలేదని తెలపకపోతే ఎలా
||మనసున||
.
.
(Contributed by Nagarjuna) |
Song (Male) Lyrics
Context: Boy struggles to hide his love towards the
girl (who likes him as well), since she is
engaged with his good friend!
(నా ప్రియమైన నీకు……., నను వెంటాడే కలా!)
.
||ప|| |అతడు|
మనసున ఉన్నది చెప్పేది కాదనీ మాటున దాచేదెలా
మనదనుకున్నది చేజారిందని నమ్మకపోతే ఎలా
మరి మరి తలచి ఊహలలోనే దాచి
చాటుగా చూసేదెలా
తగదని తెలిసి తలపే ఆపలేని
తప్పును చేసేదెలా
ఇకనైనా చెరగాలి నల్లని నీడలా
నను వెంటాడే కలా
||మనసున||
.
||చ|| |అతడు|
నేలకందించి ఆకాశగంగని నింగి గుండెల్లో నలుపు కడగనీ
కురిసే చల్లని వానజల్లుతో
కళ్ల ముందున్న సత్యాన్ని చూపని రెప్ప చాటున్న నిదుర కరగనీ
ఉబికే వెచ్చని కన్నీళ్లతో
అందిస్తున్నా నా ప్రియమైన నీకు అక్షింతలుగా నా ప్రతి ఆశనీ
కలకాలం నీ నవ్వే నిను నడిపించనీ
నను వెంటాడే కలా
||మనసున||
.
||చ|| |అతడు|
నన్ను రమ్మన్న చెలిని వెన్నెల దాటి రానంది చీకటి కాపలా
ఇకపై తెరలను తీసేదెలా
నిన్ను నిన్నల్లో ఆపిన నిజమిలా జ్ఞాపకలతో అల్లింది సంకెల
గతమే శిలువగ మోసేదెలా
ఇచ్చేస్తున్న నా ప్రియమైన నీకు నీకై వెతికిన నా ప్రతి శ్వాసనే
నిను చేరి సిగ పువ్వై కొలువుండనీ
నను వెంటాడే కలా
||మనసున||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights (1 & 2)
Yet another double header - the same పల్లవి in two different contexts!
I changed the formatting of the page to accommodate both the versions in the same screen shot.
.
Semantically fascinating “meaning” with pinpoint precision in two different contexts!
Eventhough syntactically the words are still:
1) మనసు - మాటలు - మాటు
2) చెప్పాలనున్నది - చెప్పేది కాదనీ
3) ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా? -
తగదని తెలిసి తలపే ఆపలేని తప్పును చేసేదెలా?
4) నేల, ఆకాశగంగ, నింగి, గుండె, నలుపు, కురిసే, వానజల్లు
5) కళ్ళు, సత్యం, నిదుర, కన్నీళ్ళు
6) శ్వాస - ఆశ; యద - మది!
What an amazing deep conceptualization!
.
Also compare this song (Male version) with నీ స్నేహం: ఊరుకో హృదయమా where he and the groom are childhood close friends first and then the boy/girl love each other; So the lyrics (concept) are based on the స్నేహం as the root.
But here it is exactly the opposite sequence of events happened i.e. the love happened first between the boy/girl and then the groom became a friend!; so the lyrics are based on the ప్రేమ as the root.
.
Folks that is what is called Sirivennela’s precision!
……………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
August 29th, 2009 at 11:33 am
[...] చెంప నిమిరే తడీ! . Also compare this song with ప్రియమైన నీకు: మనసున ఉన్నది (Male version) where the love happened first between the boy/girl and then the groom became a friend!; so the [...]
September 24th, 2010 at 1:41 am
ADIRINDANDI BABU