Movie Name
Athadu Song Singers K.K., Sunitha Music Director Mani Sharma Year Released 2005 Actors Mahesh Babu, Trisha Director Trivikram Srinivas Producer D. Kishore
Context
Song Context: A love song
Song Lyrics
||ప|| |అతడు|
అవును నిజం నువ్వంటే నాకిష్టం
|ఆమె|
ఈ నిమిషం గుర్తించావా సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
|అతడు|
తెలుసు కదా ఆ…
తెలిసిందే అడగాలా
|ఆమె|
అడగందే అనవేలా…
|అతడు|
చెవిలో ఇలా చెబితే చాలా || అవును నిజం ||
.
||చ|| |ఆమె|
కసిరేస్తున్నా మనసుకి వినపడదో ఏమో
విసిరేస్తున్నా నిను విడి వెనకకు రాదేమో
|అతడు|
నిదురోతున్నా ఎదురై కనపడతావేమో
కదలాలన్నా కుదరని మెలి పెడతావేమో
|ఆమె|
అంతగా కంటచూడనని మొండికేస్తే తప్పేమో
|అతడు|
ఒంటిగా ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో
|ఆమె|
మన సలహా మది వినదు కదా
తెలుసు కదా అ ఆ…
|అతడు|
తెలిసే ఇలా చెలరేగాలా
||అవును నిజం||
.
||చ|| |అతడు|
సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
|ఆమె|
ఎదరేముందో తమరిని వివరములడిగానా
ఎద ఏమందో వినమని తరుముకు రాలేనా
|అతడు|
తప్పుకో కళ్లుమూసుకుని తుళ్లి రాకే నా వెంట
|ఆమె|
ఒప్పుకో నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంట
|అతడు|
నడపదుగా నిను నది వరదా
తెలుసు కదా అ ఆ ఆ…
|ఆమె|
తెలిసే ఇలా ముంచెయ్యాలా…. ||అవును నిజం||
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world