అతడు: పిల్లగాలి అల్లరి

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Athadu

Song Singers
   Shreya Goshal
Music Director
   Mani Sharma
Year Released
   2005
Actors
   Mahesh Babu, Trisha
Director
   Trivikram Srinivas
Producer
   D. Kishore

Context

Song Context: అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా!

Song Lyrics

||ప|| |ఆమె|
       పిల్లగాలి అల్లరి ఒళ్లంతా గిల్లి నల్లమబ్బు ఉరిమేనా || 2 ||
       కళ్లెర్రజేసి మెరుపై తరిమేనా
       ఎల్లలన్నీ కరిగి ఝల్లుమంటూ ఉరికి
       మా కళ్లలో వాకిళ్లలో వేవేల వర్ణాల వయ్యారి జాణ
       అందమైన సిరివాన…ముచ్చటగా మెరిసే సమయాన
       అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా
.
||చ|| |ఆమె|
       మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా
       గారంగా పిలిచేనా..
       ఝల్లుమంటు గుండెలోన తుంటరిగా తుళ్లుతున్న తిల్లానా
                                               ||మౌనాల||
       ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా
       చంద్రజాలమై తారంగాల ఒడిలో ఏళ్లన్నీ మురిపించగా
       తారలన్నీ తోరణాలై ద్వారాన ముత్యాల హారలయేనా
       చందనాలు చిలికేనా…ముంగిలిలో నందనాలు విరిసేనా
       అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా
.
||చ|| |ఆమె|
       నవ్వుల్లో హాయిరాగం.. మువ్వల్లో వాయువేగం
       ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం
       ఇవ్వాళే పంపెనేమో ఆహ్వానం || నవ్వుల్లో ||
       పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
       స్వాతిజల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా
       నింగి దాకా పొంగిపోగా హోరెత్తిపోతున్న గానా బజానా
       చెంగుమంటూ ఆడేనా..చిత్రంగా జావళీలు పాడేనా
       అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా
.
.
                          (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)