Movie Name
Priyamiana neeku Song Singers S.P. Balu Music Director Bala Sekharan Year Released 2001 Actors Tarun, Sneha
Sridevi, Sivaji Director Siva Shankar Producer R.B. Chowdary
Context
Song Context: ఓ ప్రేమికుని విరహగీతం
Song Lyrics
||ప|| |అతడు|
వేయి జన్మాల చెలిమి నీవే - తెలుసు నా గుండెకీ
కోటి దీపాల వెలుగు నీవే - తెలుసు నా కంటికి
నిను దాచే ఈ నిశి - నిలిచేనా ప్రేయసీ
నలువైపుల నల్లని చీకట్లే ఎదురొస్తూ ఉన్నా
పరుగాపని పాదం దూరంతో పోరాడుతు ఉన్నా
కనుపాపకి ఉప్పని కన్నీరే తెర వేస్తూ ఉన్నా
ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ ఉన్నా
||వేయి జన్మాల||
.
||చ|| |అతడు|
గాలితో నువ్వు పంపిన వలపు ఊసేవిటో
పూలలో నువ్వు నింపిన తీపి తలపేవిటో
నిన్న దాక నను చేరలేదని నమ్మదా చెలీ నీ మౌనం
నా శ్వాసతో రగిలే ఈ గాలులతో నిను వెతికిస్తున్నా
నా ప్రేమను పూల సువాసనతో నీకందిస్తున్నా
ఎద సవ్వడులే ఆ గువ్వలుగా ఎగరేస్తూ ఉన్నా
అవి నిన్నే చూడాలి నువ్వెక్కడ ఉన్నా
||వేయి జన్మాల||
.
||చ|| |అతడు|
ఆశగా ఉంది నెచ్చెలి కలుసుకోవాలని
కోవెలై ఉంది కౌగిలి దేవి రావాలని
నీవు కలవనీ కలవు కాదనీ ఋజువు చేయనీ అనురాగం
నను నేడే శిలగా మోస్తున్నా ఎద బరువైపోదా
చిరునవ్వుల్నే వెలివేస్తున్నా నిను చూశేదాకా
ప్రతి రక్తకణం వెలిగిస్తున్న పెను జ్వాలైపోదా
ఎడబాటు పొరబాటు కరిగించేదాకా
||వేయి జన్మాల||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
ఓ ప్రేమికుని విరహగీతం, అయినా ఎంతో ఆశావాదంతో! A Sirivennela’s unique presentation! ……………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world