Movie Name Priyamiana neeku Song Singers S.P. Balu, Chorus Music Director Bala Sekharan Year Released 2001 Actors Tarun, Sneha
Sridevi, Sivaji Director Siva Shankar Producer R.B. Chowdary
Context
Song Context: ఓ ప్రేమ గీతం! (నా మనసు దోచిన ఆ ప్రేమ, ఏనాటికి చూపునో చిరునామా!)
Song Lyrics
||ప|| |అతడు|
నేలనడిగా పువ్వులనడిగా నీలి నింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదనీ
గాలినడిగా మబ్బులనడిగా రామ చిలక రెక్కలనడిగా
క్షేమంగా ఉందా అనీ
అయినా ఇంత వరకు ఆచూకీ లేక తెగిన గాలిపటమై తిరిగా
ఎటూ దారి తోచక… ఆగలేక
నా మనసు దోచిన ఆ ప్రేమ ఏనాటికి చూపునో చిరునామా
||నేలనడిగా||
.
||చ|| |అతడు|
ఇపుడే ఇటు వెళ్లిందంటూ చిరుగాలి చెప్పింది
నిజమే! ఇంకా గాలుల్లో చెలి పరిమళముంది
ఇందాక చూశానంటూ సిరిమల్లె చెప్పింది
ఇదిగో అంటూ తనలో చెలి చిరునవ్వే చూపింది
ఈ గుడి గంటల్లో తన గాజుల సడి వింటుంటె
తను ఈ కోవెల్లో ఇప్పటి వరకూ ఉన్నట్టే
ఎటు చూసిన తన జాడలే ఎటు వెళ్లిందో ఈ లోపునే
||నేలనడిగా||
.
||చ|| |అతడు|
నడయాడే దీపంలాంటి ఆ రూపం చూస్తుంటే
కనుపాపల్లో కలకాలం కొలువుండిపోతుంది
నడకైనా నాట్యం లాగే అనిపించే తన వెంటే
దివిలో ఉండే మెరుపే దిగి వచ్చిందనిపిస్తుంది
ఎందరు చూశారో కలగన్నామనుకున్నారో
అందుకనే ఏమో ఏమో తను నిజం కాదనుకున్నారో
బతిమాలినా బదులివ్వదే తను ఉందంటే నను నమ్మరే
||నేలనడిగా||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
………………………………………………………………………………………………..
One Response to “ప్రియమైన నీకు: నేలనడిగా పువ్వులనడిగా నీలి నింగి చుక్కలనడిగా”
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world
January 10th, 2014 at 1:13 pm
Please post 2012, 2013 lyrics