|
Context
Song Context:
ఎంతసేపైనా ఎదురుచూపేనా నా గతి
|
Song Lyrics
||ప|| |ఆమె|
ఎంతసేపైనా ఎదురుచూపేనా నా గతి
ఎంతకీరాడు ఏమిటొగాని సంగతి
ఈవేళ ఈచోటని రమ్మంది తానేనని ||2||
బొత్తిగా మరిచి పోయాడో ఎమిటొ
||ఎంతసేపైనా||
.
||చ|| |ఆమె|
ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా అతనినేగా నమ్ముకుంటున్నా
వెక్కిరించే వేయిమందున్నా ఒక్కదాన్నె వేగిపోతున్నా
ఎన్నాళ్ళు ఈ యాతన ఎట్టాగ ఎదురిదనా ||2||
ఏలుకోడేమి నారాజు చప్పున
||ఎంతసేపైనా||
.
||చ|| |ఆమె|
తోడులేని ఆడవాళ్ళంటే కోడేగాళ్ళు చూడలేరంతే
తోడేళ్ళే తరుముతూ ఉంటే - తప్పుకోను తప్పుకోను తోవలేకుందే
ఊరంతా ఉబలాటం నావెంటనే ఉన్నదే ||2||
ఏమి లాభం గాలితో చెప్పుకుంటే
||ఎంతసేపైనా||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
Club song Lyrics!
Huh, Can the lyrics get any more decent?
………………………………………………………………………………………………. |
|
1 Comment »