|
Context
Song Context:
వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా! |
Song Lyrics
||ప|| |అతడు|
నీతోనే ఆగేనా సంగీతం - బిళహరి
నీతోనే ఆగేనా సంగీతం
బిళహరీ అని పిలువకుంటే - స్వరవిలాసం మార్చుకుంటే
ఆరిపోదు గానజ్యోతి
|| నీతోనే ||
.
చరణం:
సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన || 2 ||
యుగయుగాలుగా జగాన దారి చూపగ
అనంతమైన కాంతి ధారపోసిన
అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం || 2 ||
|| నీతోనే ||
.
చరణం:
విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది
తరంగ స్వరాల జనించు గీతం ఏది || విహంగ ||
గాలి గొంతు నేర్చుకున్న గానశాస్త్ర గ్రంధమేది
పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ || 2 ||
అహంకరించి సాగుతున్న వేళలో
ఎడారిపాలు కాదా గానవాహిని
వినమ్రతే త్యజించితే - విషాదమే ఫలం కదా || 2 ||
|| నీతోనే||
.
.
(Contributed by Pradeep) |
Highlights
The Cine Technician Asociation of South India కళైంజర్ కరుణానిధి Award 1988 Winner!
.
[Also refer to pages 171 & 41-42 in సిరివెన్నెల తరంగాలు & pages 27-28 in "నంది" వర్ధనాలు]
…………………………………………………………………………………………….. |
|
No Comments »