రుద్రవీణ: నీతోనే ఆగేనా సంగీతం బిళహరి

Posted by admin on 1st January 2010 in అహంకారం తగ్గించుకో

Audio Song:
 
Movie Name
   RudraVeena
Song Singers
   K.J. Yesudas
Music Director
   Ilaya Raja
Year Released
   1988
Actors
   Chiranjeevi,
   Shobhana
Director
   K. Balachander
Producer
   K. Nagendra Babu

Context

Song Context:
    వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా!

Song Lyrics

||ప|| |అతడు|
       నీతోనే ఆగేనా సంగీతం - బిళహరి
       నీతోనే ఆగేనా సంగీతం
       బిళహరీ అని పిలువకుంటే - స్వరవిలాసం మార్చుకుంటే
        ఆరిపోదు గానజ్యోతి
                                               || నీతోనే ||
.
చరణం:
       సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన || 2 ||
       యుగయుగాలుగా జగాన దారి చూపగ
       అనంతమైన కాంతి ధారపోసిన
       అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం || 2 ||
                                              || నీతోనే ||
.
చరణం:
       విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది
       తరంగ స్వరాల జనించు గీతం ఏది || విహంగ ||
       గాలి గొంతు నేర్చుకున్న గానశాస్త్ర గ్రంధమేది
       పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ || 2 ||
       అహంకరించి సాగుతున్న వేళలో
       ఎడారిపాలు కాదా గానవాహిని
       వినమ్రతే త్యజించితే - విషాదమే ఫలం కదా || 2 ||
                                              || నీతోనే||
.
.
                             (Contributed by Pradeep)

Highlights

The Cine Technician Asociation of South India కళైంజర్ కరుణానిధి Award 1988 Winner!
.
[Also refer to pages 171 & 41-42 in సిరివెన్నెల తరంగాలు & pages 27-28 in "నంది" వర్ధనాలు]
……………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)