Movie Name
Kotha Bangaru Lokam Singers Swetha Pandit Music Director
Mickey J. Meyer Year Released 2008 Actors
Varun Sandesh,
Swetha Prasad Director Sreekanth Addala Producer Dil Raju
Context
Song Context: నేను నీ నీడని నువ్వు నా నిజమనీ ఒప్పుకోగలరా ఎపుడైనా!
Song Lyrics
||ప|| |ఆమె|
నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే
.
||చ|| |ఆమె|
మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసు లోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ మాయేనా || నేననీ నీవనీ ||
.
||చ|| |ఆమె|
పదము నాది పరుగు నీది
రథం వయ్యిరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడక వెనువెంటే రానా || నేననీ నీవనీ ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
నేననీ నీవనీ వేరుగా లేమనీ, చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమనీ, ఒప్పుకోగలరా ఎపుడైనా
.
రెండు అమాయకపు ప్రేమ పక్షులు ‘నేనూ నీవూ ఒకటే’, ‘మనది ఒకే ప్రాణం’. ‘ఆ ప్రాణాన్ని దేవుడిలా రెండు దేహాల్లో బంధించి భూమిపై పడేశాడు’. అలాంటి రెండు అర్ధ ప్రాణాలమైన మనము, కలిసి ఒకటై ఆనందడోలికలలో ఊగుతుంటే మధ్యలో ఈ పెద్దలేమిటి? వీరి అడ్డులేమిటి? అని అనుకుంటున్నాయి.
.
ఈ నేపధ్యంలో సగటు రచయిత ఓ ప్రేమికురాలి మనోవేదనను ప్రేక్షకుడికి తెలియబరిచే ప్రయత్నం చేస్తాడు. ప్రతి రచయితా ఒక పాత్ర మనసులోకి తొంగిచూసి ఆ భావాలకు పదాలను అల్లాలని ప్రయత్నించడం సహజం. కానీ ఇక్కడ శాస్త్రి గారు ఆ ప్రేమ పక్షుల మనసుల లోకి తొంగిచూడడమేకాదు అక్కడ తిష్ఠ వేసి వారి మనోవేదనను ఓ ప్రేక్షకుడికే కాదు, ఆ ప్రేమికులకే చూపించగలిగాడు అని అనిపిస్తుంది. పై పల్లవిలోని పంక్తులను వింటే, భగ్నప్రేమికుల మనో అంతరాలలోకి ఈ కవి ఎలా వెళ్ళగలిగాడు? వారి తపనను వారికే ఓ దర్పణంలో బంధించి ఎలా చూపగలిగాడు? అనే సందేహం రాక తప్పదు. ప్రేమలోపడి ఎన్నోకష్టాలలో నలిగిన వారివలె ఎలా వ్రాయగలిగారు? ప్రపంచంలో అందరి బాధను వారికంటే ఎక్కువగా అనుభవించినట్లు ఎలా వ్రాయగలరు? సగటు మనిషి అనుభవించే సంతోషాన్నైనా, బాధనైనా తనే అనుభవించినట్లు ఆ అనుభూతులను అందంగా ఈ కవి ఎలా పొందుపరచగలరు అని నాకు అనిపిస్తుంది. Who is this divine messenger? How can he read minds? .
||చ|| |ఆమె|
పదము నాది పరుగు నీది, రథము వయిరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది, గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా, ఎటూ చూడక వెనువెంటే రానా || నేననీ నీవనీ ||
.
ఓ నిస్సహాయురాలయిన ప్రేయసి తన ప్రియుణ్ణి ‘నన్ను ఈ పంజరంలోంచి విడిపించుకుని నీ దగ్గరకు చేర్చుకో’ అనే భావాన్ని ఇంతకన్నా ఉత్తమంగా వ్రాయడం అసంభవమని నాకనిపిస్తుంది.
.
. Analysis by Dr. Jayasankar
……………………………………………………………………………………………..
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world