కొత్త బంగారు లోకం: నేననీ నీవనీ వేరుగా లేమనీ చెప్పినా వినరా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Kotha Bangaru Lokam
Singers
   Swetha Pandit
Music Director
   Mickey J. Meyer
Year Released
   2008
Actors
   Varun Sandesh,
   Swetha Prasad
Director
   Sreekanth Addala
Producer
   Dil Raju

Context

Song Context:
     నేను నీ నీడని నువ్వు నా నిజమనీ ఒప్పుకోగలరా ఎపుడైనా!

Song Lyrics

||ప|| |ఆమె|
       నేననీ నీవనీ వేరుగా లేమనీ
       చెప్పినా వినరా ఒకరైనా
       నేను నీ నీడని నువ్వు నా నిజమనీ
       ఒప్పుకోగలరా ఎపుడైనా
       రెప్ప వెనకాల స్వప్నం
       ఇప్పుడెదురయే సత్యం తెలిస్తే
       అడ్డుకోగలదా వేగం
       కొత్త బంగారు లోకం పిలిస్తే
.
||చ|| |ఆమె|
       మొదటి సారి మదిని చేరి
       నిదర లేపిన ఉదయమా
       వయసు లోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
       మరీ కొత్తగా మరో పుట్టుక
       అనేటట్టుగా ఇది నీ మాయేనా     || నేననీ నీవనీ ||
.
||చ|| |ఆమె|
       పదము నాది పరుగు నీది
       రథం వయ్యిరా ప్రియతమా
       తగువు నాది తెగువ నీది
       గెలుచుకో పురుషోత్తమా
       నువ్వే దారిగా నేనే చేరగా
       ఎటూ చూడక వెనువెంటే రానా    || నేననీ నీవనీ ||
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

   నేననీ నీవనీ వేరుగా లేమనీ, చెప్పినా వినరా ఒకరైనా
   నేను నీ నీడని నువ్వు నా నిజమనీ, ఒప్పుకోగలరా ఎపుడైనా
.
రెండు అమాయకపు ప్రేమ పక్షులు ‘నేనూ నీవూ ఒకటే’, ‘మనది ఒకే ప్రాణం’. ‘ఆ ప్రాణాన్ని దేవుడిలా రెండు దేహాల్లో బంధించి భూమిపై పడేశాడు’. అలాంటి రెండు అర్ధ ప్రాణాలమైన మనము, కలిసి ఒకటై ఆనందడోలికలలో ఊగుతుంటే మధ్యలో ఈ పెద్దలేమిటి? వీరి అడ్డులేమిటి? అని అనుకుంటున్నాయి.
.
ఈ నేపధ్యంలో సగటు రచయిత ఓ ప్రేమికురాలి మనోవేదనను ప్రేక్షకుడికి తెలియబరిచే ప్రయత్నం చేస్తాడు. ప్రతి రచయితా ఒక పాత్ర మనసులోకి తొంగిచూసి ఆ భావాలకు పదాలను అల్లాలని ప్రయత్నించడం సహజం. కానీ ఇక్కడ శాస్త్రి గారు ఆ ప్రేమ పక్షుల మనసుల లోకి తొంగిచూడడమేకాదు అక్కడ తిష్ఠ వేసి వారి మనోవేదనను ఓ ప్రేక్షకుడికే కాదు, ఆ ప్రేమికులకే చూపించగలిగాడు అని అనిపిస్తుంది. పై పల్లవిలోని పంక్తులను వింటే, భగ్నప్రేమికుల మనో అంతరాలలోకి ఈ కవి ఎలా వెళ్ళగలిగాడు? వారి తపనను వారికే ఓ దర్పణంలో బంధించి ఎలా చూపగలిగాడు? అనే సందేహం రాక తప్పదు. ప్రేమలోపడి ఎన్నోకష్టాలలో నలిగిన వారివలె ఎలా వ్రాయగలిగారు? ప్రపంచంలో అందరి బాధను వారికంటే ఎక్కువగా అనుభవించినట్లు ఎలా వ్రాయగలరు? సగటు మనిషి అనుభవించే సంతోషాన్నైనా, బాధనైనా తనే అనుభవించినట్లు ఆ అనుభూతులను అందంగా ఈ కవి ఎలా పొందుపరచగలరు అని నాకు అనిపిస్తుంది. Who is this divine messenger? How can he read minds?
.
||చ|| |ఆమె|
   పదము నాది పరుగు నీది, రథము వయిరా ప్రియతమా
   తగువు నాది తెగువ నీది, గెలుచుకో పురుషోత్తమా
   నువ్వే దారిగా నేనే చేరగా, ఎటూ చూడక వెనువెంటే రానా || నేననీ నీవనీ ||
.
ఓ నిస్సహాయురాలయిన ప్రేయసి తన ప్రియుణ్ణి ‘నన్ను ఈ పంజరంలోంచి విడిపించుకుని నీ దగ్గరకు చేర్చుకో’ అనే భావాన్ని ఇంతకన్నా ఉత్తమంగా వ్రాయడం అసంభవమని నాకనిపిస్తుంది.
.
.
                                     Analysis by Dr. Jayasankar
……………………………………………………………………………………………..

One Response to “కొత్త బంగారు లోకం: నేననీ నీవనీ వేరుగా లేమనీ చెప్పినా వినరా”

  1. ramesh Says:

    Heart touching lyrics

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)