Archive for the ‘ప్రాణమన్నది బంగారు పెన్నిధి నూరేళ్లు నిండుగా జీవించమన్నది వేటాడువేళలో పోరాడమన్నది’ Category

శ్రీకారం: మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు

Audio Song:
 
Audio Song (By Sirivennela garu with explanation):
 
Video Song:
 
Movie Name
   Srikaram
Song Singers
   K.J. Yesudas
Music Director
   Ilaya Raja
Year Released
   1996
Actors
   Jagapathi Babu,
   Heera
Director
   P. Umamaheswara Rao
Producer
   Gavara ParthaSarathi

Context

Song Context:
     మాను జన్మకన్న – మనిషి ఎంత మిన్న
     ఊపిరిని పోసే ఆడదానివమ్మ
     బేలవై నువ్వు కూలితే – నేలపై ప్రాణముండదమ్మ!
     మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు

Song Lyrics

||ప|| |ఆమె|
       మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు
       కనుల నీరు తుడుచువారు ఎవరూ లేరని చితి ఒడికి చేరాకు
       ప్రాణమన్నది బంగారు పెన్నిధి నూరేళ్లు నిండుగా జీవించమన్నది
       వేటాడువేళలో పోరాడమన్నది
                                                  ||మనసు కాస్త||
.
।।చరణం 1 ।।
       కలసి రాని కాలమెంత కాటేస్తున్న – చలి చిదిమేస్తున్న
       కూలిపోదు వేరు ఉన్న తరువేధైనా – తనువే మోడైనా
       మాను జన్మకన్న – మనిషి ఎంత మిన్న
       ఊపిరిని పోసే ఆడదానివమ్మ
       బేలవై నువ్వు కూలితే – నేలపై ప్రాణముండదమ్మ
                                                   ||మనసు కాస్త ||
.
।।చరణం 2।।
       ఆయవంతా ఆయుధంగా మార్చవే నేడు – పరిమార్చవే కీడు
       కాళివైతే కాలికింద అణుగును చూడు – నిను అణిచేవాడు
       మృత్యువును మించే హాని ఎక్కడుంది
       ఎంత గాయమైనా మాని తీరుతుంది
       అందుకే పద ముంధుకే – లోకమే రాదా నీ వెనకే
                                                   ।।మనసు కాస్త ।।
.
.
                       (Contributed by Bhagirathy)

Highlights

                          1996 Nandi Award Winner!
.
.
A Sirivennela Classic!
.
Also checkout on the left, the mp3 audio - the explanation of this song by Sirivenenla garu - recorded while travelling on a highway in a casual session, if you can ignore the background noise.
.
Over the years in my profession, I have counselled quite a few women patients in the ERs and ICUs after their attempted suicide, never it occured to me to tell a woman that you are here to give life not to take your own. That is what Sirivennela garu is. He thinks above and beyond!!
Here it goes..
.
     మనసు కాస్త కలత పెడితే మందు ఇమ్మని, మరణాన్ని అడగకు
     కనుల నీరు తుడుచు వారు ఎవరు లేరని, చితి ఒడిని చేరకు
అంటూ ఓ చక్కటి ఉపమానంతో అచ్చు సిరివెన్నెల గారి బాణీలో ‘బాధలకు ఆత్మహత్య సమాధానము కాదు’ అని ఈ పల్లవి చెపుతుంది.
.
చరణం 1:
ప్రాణం కంటికి కనపడదు. అది ఉంటేనే జీవి, లేదంటే శవం. అది ఏ జీవికైనా పుట్టుకతో మొదలై చావు వరకూ ఉండే ఒకే ఒక తోడు. జీవి పుట్టిన మరుక్షణం నుంచీ ఈ ప్రాణాన్ని కాలం (వేళ) వేటాడుతూంటుంది. (Have you ever seen a premature infant in ICU fighting for their life? That is what I mean fight with కాలం starts as soon you are born..) ఆవేటలో కాలం గెలిస్తే ప్రాణం బలి అయిపోతుంది, జీవి అంతమయిపోతుంది. కాబట్టి ‘ఓ జీవీ! ప్రాణాన్ని పదిలంగా వందేళ్ళు కాపాడుకో!’ అనే భావాన్నిమొత్తం ముచ్చటగా మూడు మాటల్లో చెప్పండి చూద్దాం.
     ప్రాణమన్నది బంగారు పెన్నిధి
     నూరేళ్ళ నిండుగా జీవించమన్నది
     వేటాడు వేళతో పోరాడమన్నది
నా ఉద్దేశ్యం లో ఈ మూడు పంక్తులు ఈ పాటకు హై లైట్. అందులోనా వేటాడు వేళతో పోరాడమన్నది simply superb!
.
చరణం 2:
అబలవై అత్మాహుతి చేసుకోకు అనే సందేశాన్ని అబల అని కానీ మరే బలహీనతను ప్రదర్శించే ఉపమానాలను వాడకుండా ఎంతో చక్కగా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళి ‘ప్రాణదాతవు నీవే ప్రాణము తీసుకోవడం న్యాయమా?’ అని ఆమెకు ధైర్యాన్ని ఇస్తూ భాద్యతనీ గుర్తు చేస్తున్నారు శాస్త్రి గారు ఇలా..
     మాను జన్మ కన్నా మనిషి ఎంత మిన్న
     ఊపిరినిపోసే ఆడదానివమ్మ
     బేలవై నీవు నేల కూలితే, నేలపై ప్రాణముండదమ్మా

Also compare this song with పెళ్ళి చేసుకుందాం: నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం
.
.
                                       Analysis by Dr. Jayasankar
.
[Also refer to Page 178 in సిరివెన్నెల తరంగాలు & pages 14-17 in "నంది" వర్ధనాలు]
……………………………………………………………………………………………….