|
Context
Song Context:
శీలం అంటే గుణం అని అర్థం!
|
Song Lyrics
||ప|| |అతడు|
నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా ||2||
చేయూత నందించు సాయం, ఏనాడు చేసింది సంఘం, గమనించుమా
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
మార్గం చూపే దీపం కాదా ధైర్యం
||నువ్వేమి||
.
చరణం:
జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం
దేహానికైన గాయం ఏ మందుతోనో మాయం
విలువైన నిండు ప్రాణం మిగిలుండడం ప్రధానం
అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం
స్త్రీ ల తనువులోనే శీలమున్నదంటే
పురుష స్పర్శ తోనే తొలగి పోవునంటే
ఇల్లాళ్ళ దేహాలలో శీలమే ఉండదనా
భర్తన్న వాడెవడూ పురుషుడు కాదు అనా
శీలం అంటే గుణం అని అర్థం
||నువ్వేమి||
.
చరణం:
గురవింద ఈ సమాజం పరనింద దాని నైజం
తనకింద నలుపుతత్వం కనిపెట్టలేదు సహజం
తన కళ్ళ ముందు ఘోరం కాదనదు పిరికి లోకం
అన్యాయమన్న నీపై మోపింది పాప భారం
పడతి పరువు కాచే చేవలేని సంఘం
సిగ్గుపడక పోగా నవ్వుతోంది చిత్రం
ఆనాటి ద్రౌపదికీ ఈ నాటి నీగతికీ
అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
అంతే గానీ నీలో లేదే దోషం
||నువ్వేమి||
.
.
(Contributed by Dr. Jayasankar) |
Highlights
A Sirivennela Classic!
.
Also checkout on the left, the mp3 audio - the explanation of this song by Sirivenenla garu - recorded while travelling on a highway in a casual session, if you can ignore the background noise.
.
ఒక కామపిశాచపు అరాచకానికి బలైన ఓ వనితను ఓదారుస్తున్న ఈ పాటలో ‘బాధ పడకు బేలా లోకమింతే అంటూ ‘శీలమంటే గుణం’ అనీ ఒకరు దోపిడీ చేయగలిగిన, దోచుకొనగలిగిన సొత్తు కాదని చక్కటి కన్విన్సింగ్ పద్ధతిలో అంచెలుగా ఎదిగే భావాలతో మనకు చెపుతారు. అలాగే, ఇది అనాది (ద్రౌపది కాలం) నుంచీ మనిషికి పట్టిన తెగులేనని, చూస్తున్న కళ్ళు సిగ్గుతో చావాలి అని సమాజాన్ని మందలిస్తూ ఆ వనిత దుఃఖ్ఖానికి ఉపశమనం ఇచ్చే ప్రయత్నం అద్భుతం, నాకు నచ్చిన ఇంకో లైన్ “గురవింద సమాజం పరనింద దాని నైజం”. నేను గతంలో వ్రాశిన ఒక చిన్న వ్యాసంలో ఇలాంటి పోలికే వ్రాశాను. ఈ పాట విన్నాక మీరు శ్రీకారం: మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు పాట కూడా వినాలి. ఈ రెండిటిలో భావసారూప్యత తో పాటు కాదు ఓ చక్కటి up lifting message ఉంది.
.
.
(Analysis by Dr. Jayasankar)
.
[Also refer to Pages 176 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
March 5th, 2010 at 2:40 am
thanks for making this wonderful website.
March 5th, 2010 at 10:20 am
Amar gaaru,
Thank you very much for your feedback.