Archive for the ‘అణువణువు మెరిసినది నీ చెలిమే నను తాకిందని’ Category

వరం: ఇపుడిపుడే తెలిసినది నీలోనూ నేనున్నానని

Audio Song:
 
Movie Name
   Varam
Song Singers
   Sasi Preetham
Music Director
   M.M. Keeravani
Year Released
   2004
Actors
   Sivaji,
   Ramya Krishna,
   Puja Bharathi,
Director
   Raghu Ram
Producer
   G. Nandu,
   P. Syam Kumar

Context

Song Context:
       ఇపుడిపుడే తెలిసినది నీలోనూ నేనున్నానని
       అణువణువు మెరిసినది నీ చెలిమే నను తాకిందని!

Song Lyrics

||ప|| |ఆమె|
       ఇపుడిపుడే తెలిసినది నీలోనూ నేనున్నానని
       అణువణువు మెరిసినది నీ చెలిమే నను తాకిందని
       ఎలా నమ్మను అనే నా మది నిజంగా ఇది కలంటున్నది… కలా ఇది కథా ఇది
                                          ||ఇపుడిపుడే||
.
చరణం:
       ఇందాకా నువ్వేదో అన్నావు అని లీలగ జ్ఞాపకమున్నా
       విన్నాననుకున్నానో విన్నానో అని తేలక సతమతమైనా
       ఏరోజు ఇలాంటి సమస్య తలెత్తలేదే నా మదిలో
       భ్రమో ఏమో ఇవాళ నువ్వొచ్చి కబుర్లు చెప్పావా నాతో
                                         ||ఇపుడిపుడే||
.
చరణం:
       నేనేదో మైకంలో ఉన్నాను అని ఎవ్వరు ఏమనుకున్నా
       అందుక్కారణమెవరో అంతా తెలిసి నవ్వవుగా నువ్వైనా
       నీకోసం రహస్య స్వరాన రమ్మంటు పిలిచిందే హృదయం
       విన్నావేమో వరించి వరాలు అందిచావా నీ స్నేహం
                                         ||ఇపుడిపుడే||
.
.
                        (Contributed by Prabha)

Highlights

………………………………………………………………………………………………..