|
Context
Song Context:
ఇపుడిపుడే తెలిసినది నీలోనూ నేనున్నానని
అణువణువు మెరిసినది నీ చెలిమే నను తాకిందని! |
Song Lyrics
||ప|| |ఆమె|
ఇపుడిపుడే తెలిసినది నీలోనూ నేనున్నానని
అణువణువు మెరిసినది నీ చెలిమే నను తాకిందని
ఎలా నమ్మను అనే నా మది నిజంగా ఇది కలంటున్నది… కలా ఇది కథా ఇది
||ఇపుడిపుడే||
.
చరణం:
ఇందాకా నువ్వేదో అన్నావు అని లీలగ జ్ఞాపకమున్నా
విన్నాననుకున్నానో విన్నానో అని తేలక సతమతమైనా
ఏరోజు ఇలాంటి సమస్య తలెత్తలేదే నా మదిలో
భ్రమో ఏమో ఇవాళ నువ్వొచ్చి కబుర్లు చెప్పావా నాతో
||ఇపుడిపుడే||
.
చరణం:
నేనేదో మైకంలో ఉన్నాను అని ఎవ్వరు ఏమనుకున్నా
అందుక్కారణమెవరో అంతా తెలిసి నవ్వవుగా నువ్వైనా
నీకోసం రహస్య స్వరాన రమ్మంటు పిలిచిందే హృదయం
విన్నావేమో వరించి వరాలు అందిచావా నీ స్నేహం
||ఇపుడిపుడే||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)