|
Context
Song Context:
ప్రేమంటే ఇదేరా! |
Song Lyrics
||ప|| |అతడు|
ప్రేమంటే ఇదేరా
|ఆమె|
వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలి పాఠం
|అతడు|
సొగసా చేరుకో వరసే అందుకో నీకిది తొలి గీతం
|ఆమె|
ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా
|అతడు|
ఊహకందని భాష నేర్చుకో మనసా
|ఆమె|
సామి రారా ప్రేమంటే ఇదేరా
|అతడు|
నా సితారా ప్రేమంటే ఇదేరా
||వయసా చూసుకో ||
.
||చ|| |ఆమె|
రేయి భారం రెట్టినంపయ్యిందీ
లే వయ్యారం నిట్టూరుస్తుంది
|అతడు|
రాయబారం గుట్టే చెప్పింది
హాయిబేరం గిట్టేలా ఉంది
|ఆమె|
మోయలేని ప్రేమంటే ఇదేరా
|అతడు|
సాయమడిగే ప్రేమంటే ఇదేరా
||వయసా చూసుకో ||
.
||చ|| |అతడు|
తేనెమేఘం కాదా నీ దేహం
వానరాగం కోరే నా దాహం
|ఆమె|
గాలివేగం చూపే నీ మోహం
తాకగానే పోదా సందేహం
|అతడు|
ప్రాణముంది ప్రేమంటే ఇదేరా
|ఆమె|
ప్రాయముంది ప్రేమంటే ఇదే
||వయసా చూసుకో ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)