|
Context
Song Context:
మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
ప్రణయానికే మన జంట నేర్పగ కొత్త మైమరపు! |
Song Lyrics
||ప|| |అతడు|
మనసే ఎదురు తిరిగి మాట వినదే
|ఆమె|
కలిసే ఆశ కలిగి కునుకుపడదే
|అతడు|
మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు
|ఆమె|
తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
|అతడు|
ప్రణయానికే మన జంట నేర్పగ కొత్త మైమరపు
.
||చ|| |అతడు|
కలలో మొదటి పరిచయం గురుతుఉందా
|ఆమె|
సరెలే చెలిమి పరిమళం చెరుగుతుందా
|అతడు|
చెలివైన చెంగలువా కలలోనే నీ కొలువా
|ఆమె|
చెలిమైన వెన్నెలవా నిజమైన నా కలవా
|అతడు|
నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా
.
||చ|| |అతడు|
చినుకై కురిసినది కదా చిలిపి సరదా
|ఆమె|
అలలై ఎగసినది కదా వలపు వరదా
|అతడు|
మనసే తడిసి తడిసి అలదాక ఏగిపోదా
|ఆమె|
తలపే మెరిసి మెరిసి తగుదారి కనపడదా
|అతడు|
వెతికే జతే కలిసి వయసు మరి ఆగనంది కదా
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)